Friday, May 3, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో..)

శంకరుని జటాజుటము నుండి గంగను తీసుకువచ్చే విధానంలో పార్వతి ప్రయత్నం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గంగను శంకరుని శిరము నుంచి ఎలాగైనా పంపించాలని వినాయకుడు, కుమారస్వామి మరియు మానసపుత్రిక జయతో పార్వతి ఏకాంతంగా చర్చించెను. గంగా కూడా శంకరునిని ప్రియతమునిగా భావించి విడిచిపెట్టుట లేదు కావున దేవతలు, అసురులు, యక్షులు, సిద్ధులు, రాజులు ఎవరూ ప్రయత్నించిననూ శివుడు గంగను విడువడు అని పార్వతి వాపోయెను. తాను మరలా హిమాలయానికి వెళ్ళి తపస్సు చేయాలా లేదా బ్రహ్మర్షులతో తపస్సు చేయించి గంగను భూమికి రప్పించాలా అనే సందిగ్ధంలో పడిన పార్వతితో తాము ముగ్గురము తగిన రీతిగా చర్చించి శివుడు గంగను విడిచిపెట్టే మార్గమును ఆలోచించెదమని వినాయకుడు పలికెను. పార్వతి దేవి సంకల్పంతో పెద్ద కరువు ఏర్పడెను. 24 సంవత్సరముల పాటు వర్షములు లేక సకల ప్రాణులు భయముతో వణికిపోయిరి. జగత్తులోని స్థావర జంగమములు క్షీణించ సాగెను. కానీ అంతటి కరువు కాలంలో కూడా గౌతమ మహర్షి ఆశ్రమము సస్యశ్యామలంగా ఉండెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement