Sunday, May 19, 2024

శ్రీకృష్ణుడికీ తప్పని కష్టాలు!

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి కొడుకు సాంబుడు. ఆ పరమాత్మ కుమారుడు అయినా కూడా అతను నేటి కలియుగ కొడుకుల్లాంటి వాడే. పెద్దల పట్ల ఏమాత్రం వినయ విధేయతలు చూపించడు. అస లు సాంబుడు శ్రీకృష్ణుడి ఎనిమిదిమంది భార్యలలో ఎవరికి పుట్టా డు? అతని జన్మ రహస్యం ఏమిటి? అనేవి తెలుసుకుందాం.
శ్రీకృష్ణ పరమాత్ముడికి అష్ట భార్యలలో ఒకరైన జాంబవతీదేవి కి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. పరమశివుడి భక్తురా లు అయిన జాంబవతి కొడుకును ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తుం ది. శ్రీకృష్ణుడు కూడా శివుడిని అడుగుతాడు. అపుడు శివుడు, నేను లయకర్తను, ఆ వచ్చే పుత్రునికి కూడా లయ లక్షణాలుంటాయి అం టాడు. సాంబుడు పుట్టుక తన యాదవ వంశ నాశనం కోసమని ముందుగా నిర్ణయించినదే కాబట్టి శ్రీకృష్ణుడు సరే అంటాడు. దాంతో పరమ శివుడు జాంబవతీదేవికి పుత్రుడిని ప్రసాదిస్తాడు. ఆ బాలుడికి సాంబుడు అతని నామకరణం చేస్తారు. అలా పుట్టిన సాం బుడికి క్రమశిక్షణారాహత్యం అత్యధికం.
దుర్యోధనుని బిడ్డ లక్ష్మణను స్వయంవరంలో ఎత్తు కొస్తాడు. అలా ఎత్తుకెళ్ళిన అమ్మాయిని వేరెవరూ వివాహమాడరు. అందుకే దుర్యోధనుడు బంధించి జైల్లో వేస్తాడు. బలరాముడితో సంప్రదిం చి రాజీపడి, లక్ష్మణకు సాంబుడికి పెళ్ళి చేస్తాడు.
ఇలా… శ్రీకృష్ణుడు కొడుకుతో ఎన్నో బాధలుపడతాడు. సాంబు డు తండ్రిని, పెద్దలను, మునులను అవమానిస్తాడు. ఒకసారి సాం బుడు స్త్రీ గర్భవతి వేషంలో ఉండగా, అటుగా వచ్చిన దుర్వాసుని తో, నాకు ఎవరు పుడతారో చెప్పమని హళన చేస్తాడు. దుర్వాసుడు ముసలం పుడుతుంది పో అని శపిస్తాడు. ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలుపుతారు. అదంతా ఒడ్డుకు కొట్టుకువచ్చి తుంగ లాగ పెరుగుతుంది. ఆ గడ్డితో విదిలిస్తేనే ఎదుటివారు మరణిస్తారు. ఆ ముసలమే యాదవ జాతిని అంతం చేస్తుందని, కృష్ణుడికి తెలుసు
కురుక్షేత్ర యుద్ధం తర్వాత, మహాపతివ్రత గాంధారీదేవి కూ డా నా సంతానం లాగే నీ యాదవవంశం కూడా అంతరిస్తుందని ఇచ్చిన శాపాన్ని కూడా శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. లోకానికి భగవద్గీ తను ప్రసాదించిన అవతార పురుషుడు, ఆ మహాతండ్రి కృష్ణుడికి కూడా ఇంత అల్లరి చిల్లర కొడుకు సాంబుడు ఉంటాడని, ఊహంచ లేం. మొత్తానికి గాంధారి శాపం, దుర్వాసుడి శాపం ఇద్దరి శాపాలు, యాదవ వంశం అంతానికి, తద్వార, ద్వాపరయుగ సమాప్తికి వా డుకున్నాడు, శ్రీకృష్ణుడు కూడ సాధారణ తండ్రి వలె కొడుకు వల్ల కష్టాలు అనుభవించాడు. అందరికి దిక్కైనా కూడా, అనాథలాగ, ద్వారక అడవిలో మరణిస్తాడు, అర్జునుడు వెతుకుతుండగా, బో యవాడు చూపిస్తే శ్రీకృష్ణుడి ఆచూకీ తెలుసుకున్న అర్జునుడు ఎంతో విలపిస్తాడు. అర్జునుడే శ్రీకృష్ణుడి అంత్యక్రియలు ముగిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధం ద్వారా ధర్మం కోసం చేసే #హంస, అ#హంసక న్న గొప్పదని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి మార్గదర్శి.

Advertisement

తాజా వార్తలు

Advertisement