Thursday, November 7, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
దానపద్ధతి
18. యస్యాన్నపాన పుష్టాంగ కురుతే ధర్మ సంచయమ్‌
అన్నస్య దాతు స్తస్యార్ధం కర్తు శ్చార్ధం న సంశయ:

యెవరి అన్నము వలన పానీయముల వలన పుష్టిపొందిన శరీరము కలవాడై ధర్మమును ఆచరించినచో అతనాచరించిన ధర్మములో సగం ఫలము అన్నాదులను ఇచ్చివానికి కలుగును. మిగిలిన సగము ధర్మమును ఆచరించిన వానికి లభించును. ధర్మమును ఆచరించాలనే మనసు బుద్ధి ఉండాలి. మరి సంపాదించాలన్నా శరీర బలము బుద్ధి బలము మనో బలము కావాలి కదా
|| అన్నమయంహి సౌమ్య మన: || అని వేదవాక్కు అనగా మనము తిన్న అన్నమే మన మనస్సుగా మారుతుంది. జలము, రసము బుద్ధిని కూర్చుతుంది. మహత్త్తత్త్వమునకే బుద్ధియని పేరు. ఆ బుద్ధి ‘అద్భ్య: బుద్ధి: సముజ్జృంభతే ‘అని పురాణోక్తి అన్నము మొదలగు వాటి వలన శరీర పుష్టి కలుగును . అనగా అన్నము మొదలగు ఆహారములనందించువాడే దానము చేయాలనే మనసును కూడా ఇస్తున్నాడన్నమాట. జలాది రసములనిచ్చు వాడు బుద్ధినిస్తున్నాడన్న మాట అందుకే చేసిన ధర్మకార్యముల సగము ఫలము దాతకు లభించును అనుటలో అంతర్యము ఇదే .

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement