Tuesday, November 28, 2023

ధర్మం – మర్మం : కార్తికమాస స్నాన విధి (ఆడియోతో…)

కార్తికమాస స్నాన విధి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

సువర్ణ రత్న పుష్పాంబు
పూర్ణ శంఖేన పుణ్యవాన్‌
సువర్ణ పూర్ణా పృథివీ
తేన దత్తా న సంశయ:

- Advertisement -
   

కార్తిక మాసములో ఈ మంత్రంతో స్నానము, అర్ఘ్యప్రదానం చేసినచో సువర్ణములు, రత్నములు మరియు పుష్పజలము నిండిన పూర్ణ శంఖంతో, బంగారం నిండి ఉన్న సంపూర్ణ భూమిని దానం చేసిన ఫలం దక్కును. ఈ మాసంలో ప్రతీ రోజు నదీ స్నానం చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ రోజులలో నదీ స్నానం చేసిన మాసఫలం దక్కును. ‘ఏకాదశి’ అనగా 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఒక మనస్సు ఈ పదకొండును నదీ జలం వంటి పవిత్రమైన భగవత్‌ ధ్యానజలంలో మునుగుట నదీస్నానం. అలాగే ఈ పదుకొండింటికి బుద్ధిని చేరిస్తే అదే ద్వాదశి స్నానం. ఈ పన్నెండింటికి అంత:కరణము, చిత్తము, అహంకారము అనే మూడు చేరిస్తే పంచదశి అదే పూర్ణిమ స్నానం. వారణాసిలో ఉన్న పంచనదములో కార్తిమాస ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజులలో సూర్యోదయానికి ముందే నదీస్నానమాచరించిన అత్యంత పుణ్యప్రదం. స్నానమాచరించే సమయంలో క్రింది మంత్రాన్ని పఠించాలి.

దేవ దేవేశ శ్రీకృష్ణ దామోదర నమోస్తుతే
అహం త్వత్‌ ప్రాప్తి కామేన స్నాస్యామి తవ ప్రీతయే
కార్తికే మాసి శ్రద్ధాళు: త్వద్ధ్యాన గత మానస:
త్వాం అర్చయిష్యన్‌ గోవింద అర్ఘ్యం దాస్వామి త్వత్‌ పర:

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement