Monday, December 4, 2023

భీమవరంలో భ‌లే బేరం.. మ‌సాజ్ సెంట‌ర్ పేరుతో వ్య‌భిచారం, ముగ్గురు అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వ‌హిస్తున్న ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం రెండో పట్టణ సీఐ బిజ కృష్ణకుమార్ వెల్లడించారు. పట్టణ పరిధిలో చినఅమిరం వద్ద తమ్మిరాజు నగర్ లో నిర్వహిస్తున్న లావిష్ బ్యూటీ అండ్ స్పాలో వ్యభిచారం జరుపుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ ఆకుల రఘుకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి ఇక్క‌డ‌ వ్యభిచారం చేయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.

- Advertisement -
   

ఈ స్పా సెంట‌ర్‌ నిర్వాహకులైన కొవ్వాడపుంతకు చెందిన యువకుడు ఇంగువ శివసురేష్, విజయవాడకు చెందిన మాంధతి మాధవ్, హైదరాబాదులోని బోరబండకు చెందిన గడ్డం వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి రూ.96వేల నగదు, 10 సెల్ ఫోన్ లు, కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు నరసాపురానికి చెందిన సత్యదేవ, విశాఖపట్నం వాసి ప్రతాప్ ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. తనిఖీల సమయంలో విజయవాడ, హైదరాబాద్ కు చెందిన నలుగురు మహిళలను గుర్తించి ఆ ముఠా నుంచి రక్షించినట్లు తెలిపారు.

కాగా, అక్టోబర్ 18న విజయవాడ నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నార‌నే సమాచారంతో పోలీసులు ఏకకాలంలో పలు స్పా, మసాజ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించి 19 కేంద్రాలను సీజ్ చేశారు. ఈ వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని వెల్లడించారు. విజయవాడలో 200కు పైగా స్పా, మసాజ్ సెంటర్లు ఉన్నాయని డీసీపీ తెలిపారు. కొన్ని స్పా, మసాజ్, ఫిట్‌నెస్‌, వెల్ నెస్, స్లిమ్మింగ్, హెల్త్ సెంటర్లలో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఆయా సెంటర్లపై వారం రోజులుగా నిఘా పెట్టిన‌ట్టు తెలిపారు. ఈ సెంటర్లలో 20 ప్రత్యేక పోలీసు బృందాలతో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా, 19 కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు.

దివ్య యూనిసెక్స్ యూటీ సెలూన్, గోల్డెన్ కోక్స్, నోవా వెల్ నెస్ ఫిట్ నెస్ సెంటర్లలో వ్యభిచారానికి సంబంధించిన కొన్ని వస్తువులు లభించినట్లు డీసీపీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత 19కేంద్రాలను సీజ్ చేశామని, అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న 18 మంది ఇతర రాష్ట్రాలు, దేశాల యువతులను, ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వారితో పాటు ఆరు కేంద్రాల నిర్వాహకులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement