Thursday, May 16, 2024

ధర్మం – మర్మం : త్రివిధ తపములు (ఆడియోతో…)

శివపురాణం ఉమాసంహిత 20వ అధ్యాయంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సాత్త్వికం రాజ సంచైవ తామసం త్రివిధం స్మృతమ్‌
విజ్ఞేయంహి తపో వ్యాస సర్వ సాధన సాధనమ్‌

సాత్త్వికం దైవతానాంహి యతీనాం ఊర్ధ్వ రేతసామ్‌
రాజసం దానవానాంహి మనుష్యాణాం తధైవచ

తామసం రాక్షసానాంహి నరాణబుూం క్రూర కర్మణాం
త్రివిధం తత్‌ ఫలం ప్రోక్తం మునిభి: తత్త్వ దర్శిభి:

సాత్త్వికము, రాజసము, తామసము అని తపస్సు మూడు విధములు. తపస్సు అన్ని సాధన ములకు సాధనం. దేవతలు, ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్యమును నిష్ఠతో ఆచరించు యతులు చేయు తపస్సు సాత్త్వికం. ఇక దానవులు, దైత్యులు, సామాన్య మానవులు చేయు తపస్సు రాజసము. రాక్షసులు, క్రూరమైన, కర్మలు చేసే మానవులు ఆచరించు తపస్సు తామసము. ఏ భావముతో ఏ ఆచరణతో ఏ విధమైన తపస్సు ఆచరించిన వారికి ఆ విధమైన ఫలమే లభిస్తుంది. సాత్త్వికమైన తపస్సు చేసిన వారికి వేరే జన్మ అంటూ లేకుండా సంసార బంధాన్ని తొలగించి మోక్ష రూప ఆనందం లభిస్తుంది. ఇక దానవులు, సామాన్య మానవులు ఆచరించు తపస్సుకు కోరికలు నెరవేరుతాయి. ఇక రాక్షసులు, క్రూర కర్మలు చేసే మానవులు ఆచరించు తపస్సుకు భయంకరమైన ఫలితమే లభిస్తుందని తత్త్వము తెలిసిన మునులు సెలవిచ్చారు.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement