Monday, April 29, 2024

చై..నా..లో ధన దాహం

  • చైతన్య, నారాయణలలో ఫీజుల దందా
  • జేఈఈ, ఐఐటీ పేరిట వేలకు వేలు ఫీజులు వసూలు
    -బకాయి ఉంటే క్లాసు రూంల్లో అవమానం..
    -యాజమాన్యాల వత్తిడితో నలిగిపోతున్న ద్యార్థులు
  • కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని అధికారులు

అడ్డూ అదుపు లేని కార్పొరేట్ కాలేజీల దోపిడీ, ధన దాహం ద్యార్థులకు శాపంగా మారింది. మాయగాళ్లు అనే పేరుకు కేరాఫ్ అడ్రస్ చైతన్య, నారాయణ ద్యా సంస్థలు నిలుస్తున్నాయి. మారుతున్న ద్యా ధానాలు, ద్యా రంగంలో వస్తున్న నూతన సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ ద్యా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ ద్యా సంస్థలు అందిన కాడికి దోచేస్తున్నాయి. ఐఐటీ, జేఈఈ కోర్సుల పేరుతో ‘సూపర్ చైన్, ఎన్వన్ 20 ‘ పేర్లతో ద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎర వేసి వేల రూపాయలను ఫీజుల రూపంలో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ద్యా సంవత్సర క్యాలెండర్ కు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ద్యార్థుల పాలిట పాశ కంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రభన్యూస్ బ్యూరో, ఒంగోలు
చైతన్య, నారాయణ కళాశాలల యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘించి దోపిడీకి పాల్పడుతున్నాయి. అడ్డూ అదుపు లేని దోపిడీ.. ధనదాహం ద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజులు చెల్లించలేని నిస్సహాయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ద్యార్థులు బలన్మరణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మారుతున్న ద్యా ధానాలు, ద్యా రంగంలో వస్తున్న నూతన సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ ద్యా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ ద్యా సంస్థలు అందిన కాడికి దోచేస్తున్నాయి. ఐఐటీ, జేఈఈ కోర్సుల పేరుతో ‘సూపర్ చైన్, ఎన్వన్ 20 పేర్లతో ద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎర వేసి వేల రూపాయలను ఫీజుల రూపంలో దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ద్యా సంవత్సర క్యాలెండర్కు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ద్యార్థుల పాలిట పాశ కంగా వ్యవహరిస్తున్నా అడిగే నాధుడే లేడు.
ఈ కార్పొరేట్ కళాశాలల ఫీజుల పై కచ్చితమైన చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ, జేఈఈ పేర్లతో భారీ ఎత్తున ప్రచారంతో కాలేజీలు ద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భష్యత్తు పై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. కోర్సును బట్టి రూ.60 వేల నుంచి లక్షకు పైగానే వసూలు చేస్తున్నారు. చేరిన వెంటనే ఫీజులో సగం కట్టాలంటూ మొదలవుతున్న ఒత్తిడి.. ఫీజుల వసూళ్ల షయంలో ద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఫీజులు చెల్లించడానికి వారం రోజులు ఆలస్యమైతే చాలు క్లాసులో నిలబెడుతున్నారని, కాసు నుంచి బయటకు వెళ్లి పొమ్మంటూ అందరిలో అవమానిస్తున్నారని ద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదే పదే మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నారు. క్లాసులకు హాజరు కానివ్వరు.. చివరి అస్త్రంగా కోర్సు పూర్తి చేసుకున్న ద్యార్థులకు.. ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు
పాల్పడుతూ.. బలవంతపు వసూళ్లకు దిగడం పరిపాటిగా మారింది.

శాస్త్రీయత ఎక్కడ..?
ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ కాదు.. వాటి ఖరారులోనే శాస్త్రీయ ధానం లేదు. కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులను కట్టడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నా.. అధికారులు దానిని పక్కాగా చేపట్టేలా చేయడంలో ఫలం అవుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో వృత్తి ద్యా కాలేజీల తరహాలో ప్రవేశాలు.. ఫీజుల నియంత్రణ క ఎటీని ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాలని, యాజమాన్యాల ఆదాయం వ్యయాలను బట్టి ఫీజులను ఖరీరు చేయాలనే ఆలోచన చేసినా, వాటిని పకడ్బందీగా చేయడంలో ఫలం అవుతున్నారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నా అది సాధ్యం కావడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement