Thursday, July 25, 2024

ధర్మం – మర్మం : వరాహ తీర్థము -1 (ఆడియతో..)

వరాహ తీర్థ వైభవము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

వరాహ తీర్థము మూడు లోకములలో ప్రసిద్ధమని ఈ తీర్థ ఆవిర్భావం గురించి బ్రహ్మ నారదునికి వివరించెను.

పూర్వము సింధుసేనుడు అను రాక్షసుడు యుద్ధములో దేవతలను ఓడించి యజ్ఞకల్పమును తీసుకుని రసాతలమున చేరగా భూమిపై యజ్ఞములు నశించి ఇహలోకము, పరలోకము లేకుండా పోయెను. ఇంద్రాది దేవతలు ఆ యజ్ఞమును అనుసరించి రసాతలమునకు వెళ్ళినా సింధుసేనుడిపై గెలవలేకపోయిరి. దేవతలందరూ విష్ణు లోకమునకు వెళ్ళి శ్రీ మహావిష్ణువునకు జరిగిన విషయమును, యజ్ఞభ్రంశమును తెలిపి యజ్ఞమును తీసుకుని వచ్చి లోకములను కాపాడమని ప్రార్థించిరి. అంతట వరాహరూపమును ధరించిన శ్రీహరి శంఖ, చక్ర, గదాది ఆయుధములను ధరించి వరాహ రూపంతో రసాతలమునకేగి యజ్ఞకల్పమును తెచ్చి రాక్షస శ్రేష్ఠులను వధించెదనని దేవతలతో పలికెను. గంగ రసాతలమునకు చేరిన దారిలోనే భూమిని ఛేధించుకుని వరాహరూపమున ఉన్న శ్రీహరి అచటకు చేరి రాక్షస శ్రేష్ఠులను సంహరించి ఆ మహా యజ్ఞ కల్పమును ముఖమున ధరించెను. వరాహరూపముతో యజ్ఞఫలమును అనుభవించి తిరిగి వచ్చిన స్వామి కొరకు దేవతలు బ్రహ్మగిరిపై ఎదురుచూడసాగెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు….
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement