Tuesday, October 8, 2024

International – ఆహారం కోసం తొక్కిసలాట – 104 మందికి మృత్యు వాత

గాజాకు సాయంపై నిషేధం విధించిన తర్వాత పాలస్తీనియన్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. గాజాలో ఆహారం కోసం ఎగబడిన సమయంలో జరిగిన కాల్పుల్లో 104 మంది మృతి చెందిన ఘటనపై ఇజ్రాయెల్‌ స్పందించిది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) శుక్రవారం అర్ధరాత్రి ఒక ప్రకటన చేసింది.

పశ్చిమ గాజాలోని అల్‌ నబుసి ప్రాంతానికి ఆహారం పంచడానికి ట్రక్కులు వచ్చినప్పుడు అక్కడి జనం ఒక్కసారిగా ఎగబడ్డారని తెలిపింది. ఆహారం తీసుకువచ్చిన ట్రక్కుల కింద పడి నలిగిపోవడంతో పాటు తొక్కిసలాట కారణంగానే ఈ ఘటనలో ఎక్కువ మంది మరణించినట్లు తెలిపింది.దీనికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) ఎక్స్‌(ట్విటర్‌)లో వీడియోలు విడుదల చేసింది.

‘ సాయం చేసే ట్రక్కులు రాగానే వాటిపై ఒక్కసారిగా వందల మంది ఎగబడ్డారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు వాహనాలను జనం మీదకు ఎక్కించారు. ఈ కారణంగా పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు చనిపోయారు’అని ఇజ్రాయెల్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement