Friday, May 10, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతముడు తన సంకల్పాన్ని అనుసరించిన విధానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

జగదీశ్వరుడైన త్రినేత్రునిని ఆరాధించి నదీ శ్రేష్ఠమైన గంగను భూమి పైకి తీసుకువచ్చి పర్వత పుత్రికైన పార్వతికి సపత్నీ పీడ తొలగించి సంతోషింప చేసెదనని గౌతమ మహర్షి సతీసమేతంగా తలచెను. ఈ విధంగా సంకల్పంచిన గౌతముడు బ్రహ్మగిరిని వీడి ఉత్తమ పర్వతమైన కైలాసపర్వతమునకేగి వాక్కుని నియమించుకుని, దర్భలను పర చుకుని ఆసీనుడై పరిశుద్ధుడై శంకరుడిని స్తుతించెను. కోరిన భోగములను ప్రసాదించుటకు అష్ట సిద్ధులు అందించుటకు ఎనిమిది శరీరములు ధరించి అష్టమూర్తివి అయ్యావంటూ గౌతమ మహర్షి శివుని స్తుతించుచుండగా
దేవతలు ఆయనపై పుష్పవర్షం కురిపించిరి.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement