Tuesday, May 7, 2024

ధ‌ర్మం మ‌ర్మం – మార్గశిరమాస విశిష్టత

వస్త్రాలంకార గంధాదీనర్పయే చ్ఛ్రద్ధయా మమ |
నైవేద్యం వివిధం దద్యాత్‌ పాయసాపూప మిశ్రితాన్‌ ||

సకర్పూరం చ తాంబూలం భక్త్యాచైవ నివేదయేత్‌ |
సుర భీణిచ పుష్పాణి భక్త్యా సమ్యక్‌ నివేదయేత్‌ ||

ధూపం దశాంగమష్టాంగం దీపంచ సుమనోహరమ్‌ |
పరిణీయ ప్రణమ్యాధ స్తుత్వా స్తుతి భిరాదరాత్‌ ||

శ్రద్ధతో నాకు వస్త్రాలంకార గంధాదుల నర్పించవలయును. పాయసా పూపములతో కూడియున్న వివిధమైన నైవేద్యమును అర్పించవలయును. తరువాత క ర్పూరముతో కూడిన తాంబూలమును భక్తితో నివేదించవలయును. సుగంధ పుష్పములను భక్తితో నివేదించవలయును. దశాంగము లేదా అష్టాంగమైన ధూపమును మనోహరమైన దీపమును అర్పించి నమస్కరించి ఆదరముతో స్తుతులతో స్తుతించి పర్యంకమున శయనింపచేసి మంగలార్ఘ్యమును నివేదించవలయును.

డా|| కందాడై రామానుజాచార్య ఎమ్‌.ఎ., పి.హెచ్‌డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement