Thursday, May 2, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ..

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వ‌చ్చిన భ‌క్తుల‌తో కొండ పై అన్ని కంపార్టుమెంట్లు నిండిపోగా.. రాంభగీచ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. వీరికి శ్రీవారి దర్శనం 24 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 64,292 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 30,641 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.72 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement