Saturday, May 11, 2024

బావ మరదుల హృదయోల్లాసము!

అది వైకుంఠం. శ్రీమన్నారాయణుడు రమాదే వి ముచ్చటించుకుంటున్నారు. మధ్యలో శ్రీ మహావిష్ణువు ”లక్ష్మీ! మాబావ శివుణ్ణి, నా చెల్లి పార్వతి (విష్ణు భగినీ) పలకరించి చాలా రోజులైంది. అంతేకాదు ఒక ముఖ్య విషయం చర్చించాలనుకు న్నాను. గరుత్మంతుడు ఏడి!” అన్నాడు.
శ్రీదేవి ”నాథా! వైనతేయుడు అనంతనాగునితో ముచ్చట్లలో మునిగియున్నాడు.” అంది.
”సమయము మీరి పోతున్నది. తొందరగా రమ్మను”అన్నాడు శ్రీహరి.
స్మరణమాత్రాన ఖగరాజు దేవర చెంత వ్రాలా డు. శ్రీహరి ”మనం వెంటనే కైలాసం వెళ్ళాలి తయా రవ్వు” అన్నాడు స్వామి. ఏమిటి సంశయమనగా-
భార్గవి ”ఖగరాజు నీయానతి విని కనలేడో- వైకుంఠానికి కైలాసానికి బహుదూరం బనినాడా” అన్నది.
పక్షి రాజు అది విని ”అమ్మా! విష్ణుమూర్తి అను గ్ర#హం వుంటే విశ్వప్రదక్షణ తృటి కాలంలో చేయగ లను. ఆ శక్తి దేవర ప్రసాదం. చతుర్దశ భువన సంచా రం నాకు వెన్నతో పెట్టిన విద్య” అన్నాడు.
వైకుంఠరాణి సమ్మతంతో స్తితిరాజు లయరాజును చూచుటకు ప్రయోన్ముఖుడైనాడు.
ము#హూర్త కాలంలో కైలాస గిరి చేరాడు. ప్రదోషకా లమైంది. ఫాలాక్షుడు మహానృత్యం చేస్తున్నాడు. నీటి పుత్రుడు (బ్రహ్మ) పరమేశ్వరుని తాండవ ##హల చూస్తు న్నాడు. శ్రీ#హరి తనయుని కుశల ప్రశ్నలు వేసి ఆశీర్వ దించాడు.
పరమేశ్వరుని నృత్యానికి విశ్వమాగగలదా? అను చందాన అక్కడ చిత్రగతుల లయరీతుల కేళీ వినోదం జరుగుతున్నది. ప్రమథగణాలు ఉన్మత్త స్థితిలో మైమర చి వున్నారు. నిటలాక్షుని నృత్య##హలకు పరవశించిన కమలాక్షుడు వచ్చిన పని మరచి సంతోషాంతరంగుడై స్తబ్ధుడయ్యాడు.
రుద్రుడెందుకో క్రోధాగ్నితో భీతావహంగా నృత్యి స్తున్నాడు. అది యుగాంత సూచన అన్నట్టుంది. అంత టా నిశ్శబ్దం. ఎవరూ రుద్రునికి అంతరాయం కలిగించ సాహసం చేయలేదు. కొంత సమయమైన తర్వాత #హరుడు #హరిని గమనించి ##హల ఆపి ”ఏం బావా! ఇలా దయచేశారు. ఊరక రారు మహాత్ములు” అన్నాడు.
”బావా! నీతో ఒక విషయం చర్చించాలనుకొన్నా ను. అలాగే నా చెల్లి ‘గిరిజ’ను చూసి చాలా రోజులైంది. పలకరించి మీరు పెట్టు మృష్టాన్న భోజనం స్వీకరించి వెళ్ళి వస్తాను.” అన్నాడు.
”బావా! మాకెంత అదృష్టం. ఈరోజు ఎంత సుది నం. అన్నపూర్ణాదేవి చేతి వంట తిన్న తర్వాత వేరు భోజ నం రుచించునా బావా!” అన్నాడు.
భగినీ #హస్త భోజనం చేసి తాంబూల చర్వణమైన తర్వాత ఈశ్వరుడు ”ఇప్పుడు చెప్పు బావ తమరి రాక కు కారణం” అన్నాడు.
”ఏమీలేదు బావా! లయకారకుడవు నీకు తెలియ దా? ద్వాపర యుగాంతం కాబోతున్నది. అన్న దమ్ములు మహా సంగ్రామం చేస్తున్నారు కౌరవులు ఆహ వమునకు దిగారు. నేటికి ఏడవ రోజు.” అన్నాడు.
”అదేమి బావా! నీవు కృష్ణావతారంలో అక్కడే వున్నావుగా! రాయబారం సలిపినావుగా యుద్ధ నివార ణకు. అది ఉత్తుత్తేనా” అని పరిహాసమాడాడు.
”ఎంతమాట బావా! నా శక్తి వంచన లేకుండా చెప్పి చూశాను. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? అయి నా ఇప్పటికి ఏడవ రోజు. ఎందరో మృతి చెందారు. నీకు లయ భోజనమైనది కదా?” అని తాను పరిహసించాడు.
వెంటనే పరమేష్టి కోపోద్రిక్తుడై ”అదోక్షజుని జూసి ఈ సృష్టి మొత్తం భస్మీపటలం గావించెద. ఇక ఏ సృష్టి లేదు. నా నిర్గుణానందంలో నేనుంటాను” అని హుంక రించాడు. చతుర్ముఖుడు నిరుత్తరుడై భయపడి ”నా వయసు 51 సంవత్సరాలు. (ద్వితీయ పరార్ధే) నేనూ అర్ధాయుష్కుడనా? కందర్ప భంగుని చూడలేక తండ్రి వంక దీనంగా చూశాడు. నేను పరబ్ర#హ్మను చేరక వున్న చోట వుండక క్రిందకు రాక త్రిశంకు స్వర్గమా?” అని ఖిన్నవదనుడై పితృదేవుని కేసి మాట్లాడకనే ముఖకవళి కలతో తెలియజేశాడు.
అంబ కూడా ”అన్నా! మాయానాటకం అప్పుడే నాథుడు ముగిస్తాడా?” అని సోదరు వంక జూసి పరిస్థితి సైగతో చక్కబెట్టమంది.
భువన మోహనుండు బ్రహ్మ, అంబతో, ”మీరేమీ భయపడకండి. నేను యుగాంతంలో సృష్టి విత్తనాలు తీసుకుని వెళ్తాను. మరల కలియుగములో మన మా యానాటకం మొదలెడ్తాము. మా బావ కోపమెంత సేపు నేను అనునయిస్తాను. ఇక 11 రోజులే కదా సర్వ నాశనా నికి.” అని శంకరుని వంక జూసి ”బావా! నీకు తెలుసు కదా సమరమందు నేను ఆయుధం ధరించనని. కిరీటికి మాట ఇచ్చాను. నీవు ఒసంగిన పాశుపత దివ్యాస్త్రాలు పార్థుని వద్దే వున్నవి. ఇప్పుడు ధర్మానికి గ్లాని కలిగింది. నేను అందుకే అవతరించిన విషయం నీకు విదితమే కదా? కొద్ది రోజులు శాంతించు. ఇక తర్వాత పని నీదే కదా, ఆట సగంలో ఆపితే శాంభవి బాధపడదా? బావా” అన్నాడు శ్రీ మహావిష్ణువు.
మ##హశ్వరుడు ”సరే! మీ ఇష్టమే నా ఇష్టం. నాకు కావలసినది ధర్మస్థాపన. అది నీవు ఎలానూ చేస్తావు కదా త్రివిక్రమా!” అన్నాడు.

ఉపసంహారం- ”బావా! శివా! యుగాంతం ముగింపు నీవే కదా చేసేది. మాయా స్వరూపిణి నా సోద రి నీ ప్రళయ నృత్యానికి సాక్షిగా నిలుస్తుంది. నా స్వరూ పంతో ఉద్భవించి కృష్ణ ద్వీపంలో తపస్సు చేసి వ్యాస నామధేయంతో వేద విభాగం చేసి భగవద్గీత ఉపనిషత్తు లు, బ్ర#హ్మ సూత్రాలు వ్రాస్తాడు. అష్టాదశ పురాణాలను వ్రాసి భావి యుగాల జీవులకు మార్గదర్శనం చేస్తాడు. ఇక సమరభూమి భూలోకంలో
తెగింపు నాది- ముగింపు నీది- ఏమంటావు బావా” అని ఇలా నుతించాడు.
”నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ:
నమస్తే అస్తు ధన్వనే
బా#హుభ్యా ముతతే నమ:”
”ఓ రుద్రా! నీ క్రోధమునకు నీ బాణమునకు, నీ ధన స్సుకు, నీ బాహువులకు నమస్కరించెదను. వీనిని మా యందు ప్రయోగింప వలదు.” అని కీర్తింప భోళాశంక రుడు ముదితాంతరంగుడై ”నీవు.. నేను వేరేనా?” అని ఆలింగనం చేసుకొన్నాడు.
అంత మురారి ”బావా నాకు సెలవిత్తువా?” అన్నాడు.
పరమేశ్వరుడు ”నా చెల్లికి ఆశీర్వచనములందజే యమ”ని చెప్పగా… శివపార్వతులు శ్రీహరికి వీడ్కోలు పలికిరి.
జగత్తుకు తండ్రులయిన ఈశ్వరుడు, విష్ణువుల లీల తెలుసుకొనుట ఎవరి తరము? నీలమేఘశ్యాముడు నిజ సదనంబు చేరెను.

Advertisement

తాజా వార్తలు

Advertisement