Friday, May 17, 2024

ఋగ్వేద వ్యాప్తికర్త భరద్వాజుడు

మన ఇతిహాస పురాణాలలో ‘భరద్వాజుడు’ అనే పేరుతో ఏడుగురు వ్యక్తులు కనిపి స్తున్నారు. ఇందులో చివరివాడు తప్ప మిగతా అందరూ ఋషులే. ధర్మసూత్ర కర్త అయిన పండితుడు చివరి భరద్వాజుడు. వీరిలో మంత్రద్రష్ట అయిన భర ద్వాజుడు అత్రిమహర్షి కుమారుడు. ఇతడు చాలా వేల సంవత్సరాలు జీవించాడు. ఇతడు తన జీవితంలో చాలాకాలం వేదాధ్యయనానికే వినియోగించాడు. వేదాధ్యయనం చేయడా నికే ఇతడు తన జీవితాన్ని అనేకమార్లు పొడిగించుకున్నాడనేది విశేషం.
సంపూర్ణంగా వేదాధ్యయనం చేయటం తన లక్ష్యమని ఇతడు, ఇంద్రునికి చెప్పినప్పు డు ఇంద్రుడు నవ్వి, ‘నువ్వు చదివింది కేవలం ఇంతే’నంటూ మూడు గుప్పిళ్ళ ఇసుకను తీసి చూపించాడట. అయినా, భరద్వాజుడు నిరుత్సహపడక, తన అధ్యయనాన్ని మరింత దీక్ష తో కొనసాగించాడు. భరద్వాజుడు అంటే ‘భరత్‌ వాజ:’ అంటే ‘వీర్యమును రక్షించుకున్న వాడు’ అన్న అర్థం కూడా. ఈ అర్థం వెనుక ఒక చిత్రమైన కథ ఉంది. దేవతల గురువైన బృహ స్పతి ఒకసారి తన అన్న భార్య (వదినె) అయిన మమతను చూసి కామించాడు. ఆమె ‘ఇది తప్పు కూడద’ని ఎంత వారించినా వినక, బృహస్పతి బలాత్కారంగా తన కోరికను తీర్చు కున్నాడు. మమత గర్భంలో అప్పటికే ఉన్న పిండం, ‘ఇక్కడ ఇద్దరు శిశువులకు స్థానం లేదు’ అంటూ బృహ స్పతి వీర్యాన్ని బయటకు వెళ్లగొట్టింది. అప్పుడు ఒక మగపిల్లవాడు జన్మించాడు. ‘ద్వాజు డు’ అయిన ఈ బిడ్డను నీవు భరించమంటే నీవు భరించమంటూ వదినా మరుదులు ఇద్దరూ వాదులాడుకుంటారు. అందువల్లనే ఆ బిడ్డ ‘భరద్వాజుడు’ అయ్యాడు. చివరకు ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ బిడ్డ బాధ్యతను చేపట్టలేదు. అప్పుడు దేవత లైన ఏడుగురు మరుత్తులు భర ద్వాజుడిని తీసుకెళ్లి పెంచుతారు.
ఇదే కథ మరొకవిధంగానూ ఉంది. బృహస్పతి, మమతల మధ్య కీచులాటల కారణం గా, ఇద్దరూ కాదనుకున్న ఆ బిడ్డను ‘ద్వాజుడు’ అన్న పేరుతో మరుత్‌ దేవతలు పెంచాయి. తదనంతరకాలంలో, దుష్యంతుడు, మేనకల కుమారుడైన భరతుడు తన తర్వాత భారతదేశానికి పాలకుడు కాగల కుమారుడు లేడన్న తపనతో, ‘మరుత్‌ సోమ యజ్ఞం’ చేశా డు. అప్పుడు, భరతునికి, మరుత్‌ దేవతలు ప్రత్యక్షమై, తాము పెంచుకుంటున్న ‘ద్వాజుడు’ ను అప్పగించారు. ఆ ‘ద్వాజుడు’ను భరతుడు పెంచుకోవటంతో, అతని పేరు ‘భరద్వాజు డు’ అయిందనేది కథ ఇతడికి భరద్వాజుడనే పేరు కలగడం వెనుక మరొక కారణముంది.
‘భరే సుతాన్‌ భరే శిష్యాన్‌ భరే దేవాన్‌ భరే ద్విజాన్‌
భరే చ భార్యామవ్యాజాధ్భారద్వాజోస్మి శోభనే‘
అని శ్రీమద్భాగవతం ఆ కారణాన్ని పేర్కొంటోంది. ‘కొడుకులను, శిష్యులను, దేవత లను, బ్రాహ్మణులను, భార్యను ప్రేమతో భరిస్తాన’ని ప్రతిజ్ఞ చేసిన కారణంగానే ఇతనికి ‘భరద్వాజుడు’ అన్న పేరు కలిగింది.
ఋగ్వేదంలో 6వ మండలాన్ని దర్శించిన ద్రష్టగా భరద్వాజ మహర్షిని పేర్కొంటారు. వేదాలను సంకలించిన వేదవ్యాసుడు, భరద్వాజుడు రాసిన లేదా దర్శించిన ఋక్కులను, ఋగ్వేదంలోని 6వ మండలంలో పెట్టాడు. ఋగ్వేదంలో మొత్తం 10,552 ఋక్కులు (మంత్రాలు) ఉన్నాయి. ఈ ఋక్కులు అన్నీ ఛందోబద్ధాలు. ఆయా ఛందస్సుకు అనుగు ణంగా ఒక్కొక్క ఋక్కులో మూడు లేదా నాలుగు పాదాలు ఉంటాయి. మొత్తం ఋగ్వేదం 10 మండలాలుగా విభజితమయింది. వీటిలో 2నుంచి 7 వరకు ఉన్న మండలాలు మొదట కూర్చబడినవి. 1, 8, 9 మండలాలను ఆ తర్వాత చేర్చారు. 2 నుంచి 7 మండలాలను ‘సగో త్ర మండలాలు’ అంటారు. ఈ మండలాలలో ఒక్కొక్కదానిని ఒక్కొక్క ఋషి లేదా ఆయన సంతతి వారు దర్శించారు. గనుక వాటికి ‘సగోత్ర మండలాలు’ అనే పేరు వచ్చింది. వీటిలో 6వ మండలాన్ని అంటే ఋగ్వేదంలో 5వ మండలాన్ని భరద్వాజుడు లేదా అతని సంత తివారు దర్శించారు (రాశారు). అయితే, వేదాలు ‘అపౌరుషేయాలు’ (మనుషులు రాసినవి కావు) కనుక, వారు దర్శించినట్లు చెప్పటం జరుగుతోంది.
ఋగ్వేదం ఆరవ మండలాన్ని దర్శించిన ద్రష్టగా భరద్వాజుడు, ‘అదితి, వరుణుడు, మిత్రుడు, అగ్ని, ఆర్యమా, సవిత, భగరుద్ర, వసుగణ, మరుత్‌, రోదసీ (ద్యావాపృథ్వీ), అశ్వనీద్యయనాసత్య (అశ్వనీ దేవతలు), సరస్వతీ, వాయువు, ఋభుక్ష, పర్జన్యు’ల వంటి దేవతలను పేర్కొన్నాడు అలాగే, ‘ఉష: పర్వతాలు, పితరులు, నదులు, సరస్వతీనది, మేఘు డు’ వంటి వాటినీ ప్రార్థించాడు. ఇక్కడ శాఖాచంక్రమణం చేస్తూ, ఒక విషయాన్ని ప్రస్తావిం చడం అవసరమవుతోంది. వేదవ్యాసుని ద్వారా ఋగ్వేదాన్ని మొదట అధ్యయనం పైలుడు. ఇతడి తండ్రి పేరు కూడా పైలుడే. తల్లి పేరు పీల. యుధిష్ఠిరుడు రాజసూయం చేసినప్పుడు, పైలుడినే హూతగా వ్యాసుడు ఏర్పాటు చేశాడు. ఈ పైలుడు ఋగ్వేదాన్ని ఇంద్రప్రమతికి, భాష్కలునికి ఉపదేశించాడు. ఇంద్రప్రమతి మాండూకేయునికి, అతడు సత్యశ్రవునికి, సత్యశ్రవుడు సత్యహతునికి, అతడు సత్యశ్రీకి ఈ ఋగ్వే దసంహతను అధ్యప నం చేశారు. ఈ సత్యశ్రీకి ముగ్గురు శిష్యులు. వారు- 1. వేదమిత్ర శాకల్యుడు. 2. రథీతర శాకపూణి. 3. బాష్కలి భరద్వాజుడు. వీరు మరింతమందికి ఈ సంహ తను ఉపదే శించారు. ఇలా ఇంద్రప్రమతి శిష్యప్రశి ష్యకోటి ద్వారానే భారతదేశంలో ఈ సంహత వ్యాప్తి చెందింది. అయితే పైలుడి రెండో శిష్యుడైన భాష్క లుడి ద్వారా మాత్రం ఈ పరంపర అంతగా కొనసాగలేదు.
భరద్వాజ మహర్షి గురించిన కథలు, ఇతివృత్తాలు మనకు అనేకంగా లభ్యమవుతున్నాయి. వాటిలో కొన్ని- భరద్వాజు డు ఒక గొప్ప ఋషి. సాధారణంగా ఋ షులను మూడు వర్గాల్లోకి విభజిస్తారు.

  1. బ్రహ్మర్షులు (భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వగైరా) 2. దేవర్షులు (శుక్రా చార్యుడు, బృహస్పతి వగైరా) 3. రాజర్షులు (జనకుడు, రుతుపర్ణుడు వగైరా) వీరు కాక, వివిధ శాస్త్రాలు చెప్పిన శుశ్రుతుడు వంటి శ్రుతర్షులు, కర్మ కాండల గురించి వివరించిన జైమిని వంటివారున్నారు.
    భరద్వాజ మహర్షి ప్రస్తుత మన్వం తరంలోని సప్తఋషులలో ఒకడు. మన్వంతరం అనేది ఒక కాల మానం. దానిని ఒక్కొక్క మనువు పేరుమీదుగా వ్యవహరిస్తారు. ఇప్పటిది వైవస్వత మన్వంతరం. పూజసమయంలో మన సంకల్పంలో ఈ వివరాలను మనం నిత్యం చెప్పుకుంటాం.
    ఈ వైవస్వత మన్వంతరంలోని సప్త ఋషులు: 1. అత్రి, 2. వశిష్ట, 3.విశ్వామిత్ర, 4.జమదగ్ని, 5. కశ్యప, 6. గౌతమ, 7. భరద్వాజ.
    అయితే, గౌతమ, భరద్వాజుల స్థానే అగస్త్య, ఆంగీరసుడిని చెప్పడం ఉంది. అలాగే జమదగ్ని స్థానే భృగు మహర్షిని పేర్కొనటమూ ఉంది. ఆంగీరసుని వారసులుగా భర ద్వాజ, గౌతములను, భృగువు వారసునిగా జమదగ్నిని చెప్పటమూ ఉంది. కనుక, సప్తఋషుల విషయంలో కొంత సందిగ్ధం కనిపిస్తోంది. ఇది ముఖ్యంగా ‘ప్రవర’ చెప్పే సమయంలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మహర్షులు ఏడుగురే అయినా, కొంతమందికి నవ ఋషుల తోనూ కూడిన ప్రవర ఉండడం విశేషం.
    బ్రహ్మదేవుని మానస పుత్రుడు కుమారుడు అంగిరుడు. ఆయన భార్య శ్రద్ధ. ఈ దంప తుల కుమారుడు బృహస్పతి. బృహస్పతి కుమారుడు భరద్వాజుడు. కనుక, భరద్వాజుడు బ్రహ్మదేవునికి మునిమనుమడు. బ్రహ్మమానసపుత్రుడైన అంగిరునికి, ఆయన భార్య అయిన వసుధకు ఏడవ సంతానం గురువు (బృహస్పతి) అనీ, ఆయనకు తార, శంఖణి అని ఇద్దరు భార్యలు, భరద్వాజ, యమకంఠుడు, కచుడు అని ముగ్గురు కుమారులని మరో కథ.
    భరద్వాజుని భార్య సుశీల. ఈ దంపతులకు గర్గుడు, కాత్యాయని అని ఇద్దరు బిడ్డలు. ఈ గర్గుని కుమార్తె సుప్రసిద్ధ వ్యాకరణవేత్త అయిన గార్గి. కాత్యాయని యాజ్ఞవల్క్యుని రెండవ భార్య. యాజ్ఞవల్క్యుడు ‘శతపథ బ్రాహ్మణం’ రాశాడు. ఈ యాజ్ఞవల్క్య, కాత్యా యని దంపతులకు చంద్రకాంత, మహామేఘ, విజయ అనే ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. భరద్వాజునికి, ఘృతచి అనే అప్సరసకు పరోక్షంగా జన్మించినవాడు ద్రోణుడు.
    మరికొంతమంది అభిప్రాయం ప్రకారం భరద్వాజునికి దేవవర్షిణి అనే కుమార్తె కూడా ఉంది. ఆమె విశ్రావసును వివాహమాడింది. వీరి కుమారులలో ఒకడు సకల సిరిసంపదల కు అధిదేవుడైన కుబేరుడు. వీరి రెండవ కుమారుని పేరు లోకపాలకుడు. అయితే భర ద్వాజుడు అత్రి మహర్షి కుమారుడని మరో కథ ఉంది. శుక్ల యజుర్వేదంలో కొన్ని మంత్ర ఖండికలను దర్శించినవారిలో ఒకరైన శిరింబఠ అనే మహళను భరద్వాజుని కుమార్తెగా చెప్తారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement