Thursday, May 2, 2024

హ్యాట్సాప్‌ నర్సులు..

  • ఓపిక.. సహనానికి మారు పేరు
  • ఎన్ని కష్టాలున్నా ముఖంలో చిరునవ్వు
  • రోజురోజుకు విస్తరిస్తున్న నర్సుల సేవలు
  • తల్లితరువాత ఆప్యాయంగా పిలిచేది నర్సులనే
  • కోవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు
  • స్టాప్‌నర్సుగా ప్రారంభమై నేడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా లిల్లీమేరి
  • 29సార్లు రక్తదానం
  • ఆరుగురు గవర్నర్లతో అవార్డులు
  • గ్లోబల్‌ హ్యూమర్‌ పీస్‌ యూనివర్సిటీనుండి గౌరవ డాక్టరేట్‌
  • నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం

కరోనా సమయంలో కుటుంబ సభ్యులే దూరంగా ఉన్నారు. అమ్మో తాకితే మాకు కరోనా వస్తుందని భయపడిపోయారు… మీకన్నా నా ప్రాణం ముఖ్యం అంటూ మిన్నకున్నారు. ఇలాంటి సమయంలో మేమున్నామంటూ తమ ప్రాణాలను పన్నంగా పెట్టి వైద్య సేవలు అందించారు. ఎక్కువ సమయం ఆసుపత్రుల్లోనే ఉండి సేవలు అందించారు… కుటుంబాలను వదిలిపెట్టి కరోనా బాధితులకు నిత్యం సేవలు అందించారు. ఇలాంటి వారికి ఎన్ని లక్షలిచ్చినా తక్కువే.. వారే నర్సులు.. వాళ్లు నిజంగా సేవాముర్తులు, రోగి ఆసుపత్రిలో చేరినప్పటినుండి రోగం నయమై ఇంటికి వెళ్లేంతవరకు కంటికి రెప్పలా కాపాడుతుంది.. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఆసుపత్రికి వచ్చిన తరువాత ముఖంలోచిరునవ్వు చిందిస్తూ రోగికి సేవలు అందిస్తోంది నర్స్‌… వీరి సేవలను వెలకట్టలేము…అందుకే ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.

– ప్రభన్యూస్‌ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి :

ఆసుపత్రిలో చేరిన రోగులకు వారి శారీరక అవసరాలను నిర్వహించేందుకు ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా చికిత్సలు అందిస్తున్నారు నర్సులు. రోగిలో ఉన్న అనారోగ్యాలను నివారించేందుకు వారికి సంరక్షణ అందించడంలో నర్సుల పాత్ర కీలకం. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో సేవలు అందించారు. ఇందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పొయారు. రోగికి చిన్నపాటి ఇబ్బంది వచ్చినా వెంటనే నర్స్‌ అంటూ కేక వేస్తారు…వెంటనే వెళ్లి రోగి సమస్యను తెలుసుకుని కావల్సిన సౌకర్యాలు కల్పిస్తారు. కరోనా సమయంలో నర్సుల సేవలు అపూర్వం. కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కువ సమయం ఆసుపత్రుల్లోనే ఉండి సేవలు అందించారు. ఎవరికేమైతే నాకేమి నేను క్షేమంగా ఉండాలనుకునే ఆ రోజుల్లో తనకేమైనా ఫర్వాలేదు. కరోనా భారినపడిన వాళ్లు బతకాలనే లక్ష్యంతో సేవలు అందించారు. అందుకే చాలామంది నర్సులను సిస్టర్‌ అని పిలుస్తారు.

- Advertisement -

ముఖంలో చిరునవ్వు..
ఎన్నికష్టాలున్నా ముఖంలో చిరునవ్వుతో అన్నీ దూరమవుతాయి. ఈ ఫాలసీని నర్సులు వందకు వంద శాతం అమలు చేస్తున్నారు. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఆసుపత్రికి వెళ్లిన తరువాత వారి ముఖ్యంలో చిరునవ్వు కొచ్చొచ్చినట్లు కనిపిస్తుంది…నర్సును చూసే రోగికి అనుకున్న సమయానికి రోగం నయమమవుతుందంటే దానికి కారణం నర్సుల నవ్వులే.. రోగిని ఆప్యాయంగా పలకరించడం…వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం…సమయానికి వందలు ఇవ్వడం…సక్రమంగా వేసుకునేలా చూడటం వంటి బాధ్యతలను వందకువంద శాతం పూర్తి చేస్తున్నారు….సమయానికి రోగికి వందులు ఇచ్చి సకాలంలో వైద్యం నయమయ్యేలా చూస్తారు. రోగి కొన్నిసార్లు నర్సులపై ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటే..ఇంజెక్షన్ల సమయంలో.. మందులు వేసుకునే సమయంలో తమ కోపాన్ని నర్సులపౖౖె చూపించడం సహజమే. ఐనా నర్సులు వాటిని పట్టించుకోకుండా చిరునవ్వుతో రోగికి మందులు వేయడం దినచర్యే. ఎన్ని కష్టాలున్నా…ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వును మాత్రం దూరం చేసుకోరు…రోగి నర్సుల ముఖాల్లో చిరునవ్వును చూసి తమ బాధను మరిచిపోతుంటారు.

స్టాప్‌నర్సు నుండి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా..
స్టాప్‌నర్సుగా ప్రారంభమైన తన ప్రయాణం ప్రస్తుతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొనసాగుతోంది డాక్టర్‌ లిల్లీమేరి..గాంధీ ఆసుపత్రిలో స్టాప్‌నర్సుగా పని చేస్తూనే నర్సింగ్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొనసాగుతోంది…ఇందులో వింతేమి లేదు. కాకపోతే విధి నిర్వాహణతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏకంగా ఆరుగురు గవర్నర్లతో అవార్డులు పొంది తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 29 సార్లు రక్తదానం చేసి శభాష్‌ అనిపించుకున్నారు. మహిళల్లో చాలామంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు రారు కానీ లిల్లీమేరీ మాత్రం ఏకంగా 29సార్లు రక్తదానం చేసి ఔరా అనిపించారు. కరోనా సమయంలో అన్నదాన కార్యక్రమాలు చేశారు. లిల్లీమేరీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను గ్లోబల్‌ హ్యూమర్‌ పీస్‌ యూనివర్సిటీ లిల్లీ మేరీకి డాక్టరేట్‌ పట్టా అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement