Saturday, May 18, 2024

భక్తుల కొంగు బంగారంబుగులోని వెంకన్న

కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రకృతి అందాల నడుమ, ఎత్తైన గుట్టలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరి భక్తుల కొంగుబంగారమయ్యాడు. రెండవ పిలిస్తే పలికే దైవంగా, ‘బుగులోని వెంకన్న’గా ప్రసిద్ధుడయ్యాడు. భక్తుల కష్టాలను తీరుస్తూ పూజలందుకుంటున్నాడు.
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారు గుట్టలలో వెలసిన బుగులోని వెంకన్న జాతర సోమవారం (నవంబరు 7వ తేదీ) ప్రారంభమయింది. అయిదు రోజులపాటు (నవంబరు 12వ తేదీ వరకు) అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న జాతర సంబర శుభవేళ ఇది.

ప్రతి సంవత్సరం కార్తిక మాసం వచ్చిందంటే చాలు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా అంతటా జాతర సంరంభం ప్రారంభమవు తుంది. భక్తులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బుగులోని వెంకన్న జాగతర ఓ అందమైన ప్రకృతి మేళవింపు. కార్తిక పౌర్ణమి రోజు ప్రారంభమయ్యే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు అనేకమంది వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మేక, ఏనుగు, గుర్రపు ప్రభలను గుట్ట కింద ఉన్న ఇప్పచెట్టు చుట్టూ తిప్పు తారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ జాతరకు వచ్చిన భక్తులు తమ మొక్కు లు చెల్లించుకుంటారు.
జాతర ప్రాధాన్యత

ఈ జాతరకి అత్యంత ఘనమయిన చరిత్ర వున్నట్లు చారిత్రక ఆధా రాలు స్పష్టం చేస్తున్నాయి.
మొట్టమొదట తిరుమల తిరుపతి కొండలపై అలివేలుమంగ, పద్మా వతితో వెలిసారు వేంకటేశ్వరస్వామి. ఆ తరువాత దేవేరులతో సేద తీరడానికి బయల్దేరి జయశంకర్‌ (భూపాలపల్లి) జిల్లా రేగొండ మండలం లోని తిరుమలగిరి గ్రామ శివారులోని గుట్టలపైకి విచ్చేశారు. అందుకే స్వామివారు నడయాడిన ఈ ప్రాంతాన్ని రెండవ తిరుపతిగా ఆ ప్రాంత ప్రజలు పిలుచుకుంటారు.
ఒకసారి వెంకన్న దేవేరులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మహి ళలు పాటలు పాడుతూ వడ్లు దంచుతున్న శబ్దానికి నిద్ర పట్టక బుగులు (బాధ)గా పక్కనే ఉన్న గుట్టలపైకి అమ్మవార్లతో కలిసి స్వామి వెళ్లాడట. దీంతో నాటి నుంచి బుగులోని వేంకటేశ్వ రస్వామిగా పిలుచుకుంటున్నారు. ఆ స్వామివారు గుట్టపై ఉన్నట్లు తెలుసు కోవడానికి గొల్లవారు ఉన్న గ్రామాల్లో చల్ల అమ్ముతుండగా చల్లముంతలు, గొర్రెలు, పశువులను ఉన్నచోటనే మాయం చేయడంతో ఏమి చేయాలో తోచని ప్రజలు ఆ గుట్టలో వెలిసిన స్వామిని కొలవగానే మళ్లిd యథాస్థానంలో ప్రత్యక్షమైనట్లుగా ప్రజలు చెబు తారు. ఆ ఆనందాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. అప్పటి నుంచి కార్తిక పౌర్ణమి నుంచి జాతర జరుపుకోవడం సాంప్రదాయం అయింది.
ఈ జాతరలో ఏనుగు బండ్ల మీద దేవుడిని ఊరేగింపుగా తీసుకుపోవడం ఆన వాయితి. మేక, గుర్రం రూపాలలో బండ్లు కట్టి తిరుగుతారు.
తిరుమలగిరి నుండి వంశ అర్చకులు కూర్మాచలము వెంకటేశ్వర్లు ఇంటి నుండి స్వామి వారి విగ్రహమూలను ఊరేగింపుగా మేళ తాళాలు మధ్య అంగరంగ వైభవం గా గుట్ట మీదికి చేర్చారు. గుట్ట మీద గల గండ దీపంలో నూనె పోసి వెలిగించి జాతర ప్రారంభించారు.
ఈ సంవత్సరం జాతర రెండవ రోజు చంద్రగ్రహణం రావడంతో నేడు (8వ తేదీ) ఆలయంలో ఎలాంటి పూజ కార్యక్రమాలు జరగవు. 9వ తేదీ స్వామి వారి కల్యాణం, గుర్రపు, ఏనుగు బండ్ల తిరుగుడు, మొక్కుల చెల్లింపు నిర్వహస్తారు. 10, 11న స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, జాతర పంచామృత అభిషేకం, 12న ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. మళ్లిd దేవతా విగ్రహాలను ఊరేగింపుగా అర్చకుల ఇంటికి చేర్చుతారు.
ప్రశాంత వాతావరణంలో జరిగే ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా పోలీసు శాఖ కూడ కట్టు దిట్టమయిన చర్యలు చేపట్టింది. ఆలయ కమిటీ నిబంధనలు పాటిస్తూనే జాతరకు విచ్చేసే భక్తులు జాతరను విజయవంతం చేయాలని కోరింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యములు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. జాతరను విజయవంతం చేద్దాం. బుగులోని వెంకన్నను కొలచి, ఆయ న సన్నిధిలో పునీతులం అవుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement