Sunday, April 28, 2024

స్వధాదేవి – స్వాహాదేవి

మంత్రాలు చదివేటప్పుడు చివరిలో ”స్వాహా” అని ఎం దుకు అంటారు? అసలు స్వాహా అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే…
స్వాహా అనేది అగ్నిదేవుని భార్య పేరు అయిన స్వాహాదేవి నుంచి వచ్చింది. అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 4 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భార్య స్వధాదేవి, ఎడమ వైపున స్వాహాదేవి ఉంటారు.
దైవకార్యాల్లో ఈయనకు సమర్పించిన ఆజ్యం, హవిస్సు అన్నిటిని స్వాహాదేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుం ది.అదేవిధంగా పితృకార్యాలలో స్వధాదేవి తన పాత్ర పోషిస్తుంది.
బ్రహ్మ దేవుని పెద్దకుమారుడు అగ్ని అని విష్ణు పురా ణంలో చెప్పబడి ఉన్నది. అగ్ని దేవుని భార్య పేరు స్వాహా. హోమాలు చేస్తూ, పూజలు చేస్తూ మంత్రాలు చదివేట ప్పుడు చివరిలో ‘స్వాహా’ అనడం జరుగుతుంది. ఈ స్వా హా అన్న పదాన్ని ఉచ్ఛరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు, మంత్రాలు అన్నీ దేవునికి చేరతాయి.
బ్రహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధకర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్ధాన్ని ఆహారంగా నియమించాడు.బ్రాహ్మణులు తర్పణాలు ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా, విద్యావతిగా తీర్చిదిద్ది, ఆ కన్యకు ”స్వధాదేవి” అని నామకరణం చేసా డు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు, విప్రులు, మానవులు ”స్వధాదేవి”ని పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు.

”బ్రాహ్మణో మానసీం శశ్వత్సుస్థిర ¸యౌవనాం
పూజ్యానాం పితృదేవానాం శ్రద్దానాం ఫలదాం భజే”

అని స్వధాదేవిని ప్రార్ధిస్తూ ఉంటారు.
పరాశక్తి అంశావతారంగా స్వధాశక్తి ఆవిర్భవించి, పితృ దేవతలకు సం తృప్తిని ప్రసాదించింది. శ్రాద్ధకర్మలలో, బలి తర్పణాల్లో, తీర్ధస్నానాల్లో స్వధాదేవి నామాన్ని ఉచ్ఛరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాస మహర్షి వివరించాడు.
శరదృతువులోని ఆశ్వయుజ కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రము నాడు, కానిచో శ్రాద్ద దినమున స్వధాదేవి ని పూజించి శ్రాద్దము నాచరింపవలెను. స్వధాదేవిని రమ్య మైన కలశమున, లేక సాలగ్రామశిల యందు ఆవాహనము చేసికొని ధ్యానించి మూల మంత్రముతో పాద్యము మొదల గు ఉపచారములను సమర్పించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా” అనే మూలమంత్రమును జపిస్తూ పూజించాలి.

  • దైతా నాగపద్మలత
Advertisement

తాజా వార్తలు

Advertisement