Friday, May 3, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 38
38
సుఖదు:ఖే సమే కృత్వా
లాభాలాభౌ జయజ¸° |
తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాపమవాప్స్యసి ||
తాత్పర్యము : సుఖ దు:ఖములను గాని, లాభాలాభములను గాని, జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయుము. ఆ విధముగా చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు.

భాష్యము : శ్రీకృష్ణుడు ఇక్కడ స్వయముగా అర్జునున్ని కేవలము యుద్ధము కోసమే యుద్ధము చేయమని అనగా తాను యుద్ధాన్ని కోరుకొనుచున్నానని వ్యక్త పరచెను. ఎవరైతే ఇంద్రియ తృప్తి కొరకు కార్యములు చేయుదురో, అది సత్వగుణములో కావచ్చును లేదా రజో గుణములో కావచ్చును, దానికి తప్పక మంచి లేదా చెడు ఫలితాలను వారు అనుభవించవలసి ఉంటుంది. అయితే కృష్ణున్ని శరణుపొంది ఆయన కోరుకున్న దానిని ఆయన కోసము చేసినట్లయతే వాటికి భౌతిక ప్రతిచర్యలు ఉండవు, పాపము అంటదు. అటువంటి భక్తుడు ఎవరికీ రుణపడి ఉండడు. అదే భౌతికముగానైతే మనము ఎంతోమందికి రుణపడవలసి వస్తుంది. దీనిని భాగవతమున (11.5.41)వ శ్లోకము సమర్థిస్తున్నది. శ్రీ కృష్ణుడు పరోక్షముగా అర్జునునికి తన మనసులోని మాటను తెలియజేసెను. రాబోవు శ్లోకాలలో ఈ విషయము మరియు స్పష్టము కానున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement