Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 32
32
యదృచ్ఛయా చోపపన్నం
స్వర్గద్వారమపావృతమ్‌ |
సుఖిన: క్షత్రియా: పార్థ
లభంతే యుద్ధమీదృశమ్‌ ||

తాత్పర్యము : ఓ పార్థా ! స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు అదృష్టవంతులు.

భాష్యము : అర్జునుడు యుద్ధము చేయుటలో ఎటువంటి ప్రయోజనమును చూడలేకున్నానని, అంతేకాక నరకవాసమే ఫలితమని చెప్పియుండెను. ఈ శ్లోకమున కృష్ణుడు ఆ భావనను ఖండించుచున్నాడు. క్షత్రియుడిగా యుద్ధరంగమున నిలిచి అహింసా వాదనమును చేయుట తగదని హితవు చెప్పుచున్నాడు. వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని ప్రకారము, క్షత్రియుడు అమాయక ప్రజలను రక్షించుటకు, ధర్మాన్ని కాపాడుటకు హింసకు పాల్పడి శత్రుసైన్యాన్ని సంహరించవలసి ఉంటుంది. అర్జునుడు యుద్ధము చేసి ఓడిపోతే స్వర్గానికి, గెలిస్తే రాజ్యాన్ని పొందే సదవకాశాలు ఆయన ముందు ఉన్నప్పుడు, యుద్ధము చేయుట ఏ విధముగా చూసినా అతనికే మేలు చేస్తుందని కృష్ణుడు సూచించుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement