Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 50
50.
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కైంతేయ
నిష్ఠా జ్ఞానస్య యా పరా ||

తాత్పర్యము : ఓ కుంతీపుత్రా! ఇట్టి పూర్ణత్వమును పొందినవాడు నేను ఇపుడు సంగ్రహముగా చెప్పబోవు రీతి వర్తించుచు అత్యున్నత జ్ఞానస్థితియైన పరమపూర్ణత్వస్థితిని ఏ విధముగా పొందగలడో నీవు ఆలకింపుము.

భాష్యము : భగవంతుని కోసము తమ తమ విద్యక్త ధర్మములను నిర్వహించినంత మాత్రము చేతనే ప్రతి వ్యక్తి తన జీవిత పరిపూర్ణతనను ఎలా పొందవచ్చునో శ్రీకృష్ణుడు అర్జునునికి వివరించుచున్నాడు. కేవలము తమ తమ కార్యముల ఫలితములను భగవంతుని ప్రీత్యర్థము అర్పించినంత మాత్రమున ఉన్నతమైన ‘బ్రహ్మపు’ స్థితిని పొందవచ్చును. ఇదే ఆత్మ సాక్షత్కార మార్గము. అటువంటి విశుద్ధ కృష్ణ చైతన్యమును పొందుటయే జ్ఞానము యొక్క పరిపూర్ణత. రాబోవు శ్లోకములలో ఈ విషయము విపులముగా వివరించబడినది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement