Thursday, April 18, 2024

నేడు కేంద్ర కేబినెట్ కీలక భేటీ.. ప్రధాన అజెండా అదే!

కేంద్ర కేబినెట్ నేడు భేటీ కానుంది. ప్రధానంగా సాగ చట్టాల రద్దు అంశంపైనే చర్చ జరుగనుందని తెలుస్తోంది. దీనితోపాటు పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై కూడా చర్చించన్నారు. ఇటీవల మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి కేంద్ర కేబినెట్ వ్యవసాయ చట్టాల రద్దు తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఇప్పటికే రైతలు ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో రద్దు బిల్లు ఆమోదం పొందిన తర్వాతే రైతులు తమ నిరసన విరమించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement