Saturday, April 27, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 15

యుంజన్నేవం సదాత్మానం
యోగీ నియతమానస: |
శాంతిం నిర్వాణపరమాం
మత్సంస్థామధిగచ్ఛతి ||

తాత్పర్యము : దేహము, మనస్సు, కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించుచు యోగియైనవాడు నియమిత మనస్సు కలవాడై భౌతికస్థితి నుండి విమించుట ద్వారా భగవద్రాజ్యమును పొందును.

భాష్యము : యోగాభ్యాసము యొక్క అంతిమ లక్ష్యము ఇచ్చట స్పష్టముగా వివరింపబడినది. అది ఆధ్యాత్మిక ఆకాశము లేదా భగవద్ధామమును చేరుటయని, భౌతిక భావనలను త్యజించుటయని తెలుపబడినది. అంతేకాని ఆరోగ్యము, భౌతిక సౌఖ్యము లేదా శూన్యములో కలయుట వంటివి లక్ష్యాలని తెలుపుట అమాయకులను మోసగించుటకు మాత్రమే. భగవంతుడు గోలోకములో ఉంటూ సర్వత్రా తన వివిధ శక్తుల ద్వారా విస్తరించి ఉంటాడు. కాబట్టి భగవం తుని సృష్టిలో శూన్యమునకు తావే లేదు. భగవంతుడైన కృష్ణుని పట్ల, విష్ణువు పట్ల సరైన అవగాహన లేనిదే ఎవరూ భగవద్ధామమును చేరలేరు. కాబట్టి భక్తుడే నిజ మైన యోగి కాగలడు, జన్మ మృత్యువును జయించి ఆధ్యాత్మిక ప్రపంచమును చేరగలడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement