Saturday, September 21, 2024

గీతాసారం (ఆడియోతో…)

ఆధ్యాయం 6, శ్లోకం 32

ఆత్మౌపమ్యేన సర్వత్ర
సమం పశ్యతి యోర్జున |
సుఖం వా యది వా దు:ఖం
స యోగీ పరమో మత: ||

తాత్పర్యము : ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకొని సమస్తజీవులను వాటి సుఖ దు:ఖములందు సమమముగా చూచునో అతడే ఉత్తమయోగియనబడును.

భాష్యము : శ్రీకృష్ణుడే మానవుని సర్వ కార్యాలకూ భోక్తయని, ప్రపంచములోని అన్ని ప్రదేశాలకు, లోకాలకు యజమాని అని, అందరికీ నిజమైన స్నేహితుడని తెలియుటచే కృష్ణ చైతన్యవంతుడు ఎల్లపుడూ ఆనందముగా ఉండగలుగుతాడు. ఆ శ్రీకృష్ణుడిని మరుచుట చేతనే బద్ధ జీవులు త్రిగుణాలకు లోనై దు:ఖాన్ని పొదుచున్నారని తెలిసి అతడు తన శయశక్తులా వారికి కృష్ణ విజ్ఞానాన్ని ఇచ్చి కృష్ణున్ని గుర్తించేట ట్లు చేయుటకు కృషి చేయును. ఈ విధముగా కృష్ణ చైతన్యవంతుడు భగవంతునికి ఎంతో ప్రియమైన సేవకుడు, అత్యుత్తమ సంక్షేమ కర్త అంతేకాక తమ ధ్యానము కోసము ఏకాంత స్థలములకు వెళ్ళు యోగులకంటే, వేరే వారి కోసం పాటుపడే ఇతడే పరిపూర్ణ యోగియును అవుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement