Sunday, April 28, 2024

అష్ట ఐశ్వర్యాల వైచిత్రి

(గతవారం తరువాయి)
ఆరవ ఐశ్వర్యం ‘అధికారం’: అధికారము చేతిలో ఉంటే ఏమైనా చేసేయొచ్చు అనుకొంటాం. అధికా రాన్ని మంచి పనులకు వినియోగిస్తే ప్రయోజనకర మే. కానీ, అధికారమదం నెత్తికెక్కించుకొని ”అధి కారపూరిత బధిరాంధక శవం” వలె చరిత్రలో నిలిచిపోవడం హాన్యం. అధికారంలో ఉన్నప్పు డు మనకు జేజేలు పలికినవారే అధికారం లేన ప్పుడు ఛీ కొడతారని గుర్తెరగాలి. ”అధికారాంత ము నందు చూడవలెగా ఆ అయ్య సౌభాగ్యము ల్‌” అని ఒక చాటుపద్య కవి అన్నట్లు అధికారం కోల్పోయాక తమ స్థితి ఏమిటన్నది ఆలోచించు కొని ప్రవర్తించాలి.

ఏడవ ఐశ్వర్యం ఉత్తమురాలైన ‘సహధర్మచారిణి’: ”ఇంటికి దీపం ఇల్లాలు” అన్నారు. కష్టసుఖాలలో తోడు నీడై, సుఖశాంతులనిచ్చే భార్యను అందుకే ‘అర్ధాంగి’ అన్నారు.
”నగృహం గృహమిత్యాహు: గృహిణీ గృహ ముచ్యతే
గృహంతు గృహిణీ హినం అరణ్య సదృశం విదు:”
ఇల్లాలు లేని ఇల్లు అడవితో సమానం అన్నారు. A house without a woman is s well-decorated prison అన్నాడు స్వీడెన్‌ బర్గ్‌ అనే మహనీయుడు. ఇల్లాలులేని ఇల్లు అందంగా అలం కరింపబడిన జైలు అని అర్థం. రూపవతి, గుణ వతి, అనుకూలవతి అయిన భార్య లభిస్తే బ్రతుకు స్వర్గసమమే! అయితే భార్య అనుకూలవతి అయితే వాడు భోగి లేదా మహాయోగి అవుతాడు అని నానుడి. మరి రూపవతి, అనుకూలవతి కాని సహధర్మచారిణి లభించడము ఐశ్వర్యమేనా! చివరిదీ,
ఎనిమిదవ ఐశ్వర్యం ‘సంతానం’: ఎన్ని సంపదలు న్నా సంతతిలేని వారి జీవితం ఎడారే కదా! పిల్ల లు పుట్టడం, వారు సజ్జనులుగా పేరు పొందడం ఆనందదాయకమే. అయితే కొరగాని కొడుకు పు ట్టి, ఇంటికి అపకీర్తి తెస్తే కలిగే తలవంపులు దు: ఖభాజనాలే. ఇలా ఈ అ్టషశ్వర్యాలూ ఎంత సంతోష కార కాలో అంతటి దు:ఖ కారకాలు కూడా! మహా భారతం ఇలా చెప్పింది.
”ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు మదంబొ నరించును, స
జ్జనులైన వారికడకువ
యును వినయము నివియతెచ్చు నుర్వీనాథా”.
ధనం, విద్య, కులీనత, మొదలైన అ్టషశ్వర్యాలు దుర్మార్గులకు గర్వాన్ని పెంచుతాయట. అవే సజ్జ నులకు వినయాన్ని, అణకువను కలిగిస్తాయట. ఈ వైచిత్రి ఆశ్చర్యాన్ని కలిగి స్తుందనడంలో ఆశ్చ ర్యం లేదు కదా! అందుకే,
కుంతీదేవి నోట వ్యాసుడిలా పలికించాడు.
”భాగ్యవంతం ప్రసూ యేధా:
నశూరం నచ పండితం
శూరాశ్చ కృత విద్యాశ్చ
మమపుత్రా వనం గతా:.”
అదృష్టవంతులైన సంతానాన్ని కోరుకోవాలి కానీ శూరులను, విద్యావంతులనూ కాదు. ఎందుకంటే శూరులూ, పండితులూ అయినా నా కొడుకులు అరణ్యాల పాలైనారు కదా!
అ్టషశ్వర్యాలు సమకూరినా వాటి వెనుకే ఒక భ యం మనలను వెన్నాడుతూ ఉంటుంది. ”భోగే రోగభయం, కులే చ్యుతి భయం, విత్తేనపాలద్భ యం/ మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం/ శాస్త్రే వాద భయం, గుణ ఖల భయం, కాయే కతాంతాద్భయం/ స ర్వం వస్తు భయా న్వితం, భువినణాం వైరాగ్యమేవా భయం”. విలాసాలకు అలవాటు పడితే రోగాలొస్తాయేమో అనే భయం, సత్కులంలో జన్మించినా ఏ తప్పు చేసి వెలివేయబడతామో అన్న భయం, ధనం ఎక్కువగా ఉన్నా రాజులు లేదా ప్రభుత్వాలు దానిని స్వాధీనం చేదుకొంటారేమో అన్న భయం, సత్ప్రవర్తనతో మెలిగినా ఎప్పుడు దైన్యత ప్రాప్తిస్తుందోననే భయం, దే#హ బలమున్నా మన కన్నా బలవంతుడైన శత్రువు మనలను ఎప్పుడు ఓటమి పాలు చేస్తాడో అనే భయం, అందంగా ఉంటే ముసలితనం ఎప్పుడు వచ్చి ఈ రూపం నశిస్తుందో అనే భయం, పాండిత్యం ఉన్నా ఏ పాండితీ వివా దంలో ఓటమి కలుగుతుందో అనే భయం, సద్గు ణాలున్నా నీచుల వలన భయం, చక్కని దేహ మున్నా మరణ భయం. ఇలా అన్ని సంపదలూ భయాన్ని కలిగించేవే. వైరాగ్యమొక్కటే నిర్భయ మైంది అనిన భర్తృ హరి ఈ అష్ట ఐశ్వర్యాలు ఎలా భీతి కల్పుతాయో కళ్ళకు కట్టించారు. కనుక మనం నిరంతరం దైవనామ స్మరణలో కాలం గడపడానికి ప్రయత్నిద్దాం.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి, 944078123

Advertisement

తాజా వార్తలు

Advertisement