Thursday, May 2, 2024

అన్నమయ్య కీర్తనలు : ఇహపరసాధన

రాగం : మలయమారుతం
ప|| ఇహపర సాధన మీతలపు
సహజ జ్ఞానికి సతమీతలపు || ఇహపర ||

చ|| సిరులు ముంగిటను జిగిదడబడగా
హరిని మరువనిది అదితలపు
సరిగాంత లెదుట సందడి గొనగా
తిరమని భ్రమయనిదే తలపు || ఇహపర ||

చ|| వొడలి వయోమదముప్పతిల్లినను
అడచి మెలంగుట యదితలపు
కడగుచు సుఖదు:ఖములు ముంచినను
జడియని నామస్మరణమే తలపు || ఇహపర ||

చ|| మతి సంసారపు మాయగప్పినను
అతికాంక్షజొరనిదది తలపు
గతియై శ్రీ వేంకటపతిగాచిన
సతతము నితని శరణమే తలపు || ఇహపర ||

Advertisement

తాజా వార్తలు

Advertisement