Friday, May 3, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

రాగం : హిందోళం

ప|| కరుణించవే నిజగతి బోధించవే
హరినిన్ను కొలువగ అలసీ ప్రాణి || కరుణించవే ||

చ|| కలలో నింతుల కలసి నట్లనే
వెలికాంతలలోడి వేడుకలు
లలి నిందుకుగా లంపటములు బడి
పలుమారు నూరక బడలీ ప్రాణి || కరుణించవే ||

చ|| నిన్నటి యాహార నిజరుచి వలెనే
అన్నువ నిప్పటి ఆహారము
యెన్ననిందుకే యిడుముల బొరలుచు
కన్నగతుల కడు కలగీ ప్రాణి || కరుణించవే ||

చ|| పరుసము సోకిన బంగారమువలె
పరమ భాగవత పట్టములు
అరయగ శ్రీ వేంకటాధిప నీకృప
యిరవుగ గని తుదకెక్కీ ప్రాణి || కరుణించవే ||

Advertisement

తాజా వార్తలు

Advertisement