Sunday, May 5, 2024

అన్నమయ్య కీర్తనలు : ఎంతచదవిన

రాగం : శ్రీ
ఎంత చదివిన ఏమివినిన తన
చింత ఏలమాను సిరులేల కాలుగు

ఇతర దూషణములు ఎడసిన గాక
అతి కాముకుడు కానియప్పుడు గాక
మతి చంచలము కొంతమానినగాక
గతియేల కలుగు దుర్గతు లేలమూను

పరధనముల యాస పాసినగాక
అరిది నిందలు లేని యప్పుడు గాక
విరసవ ర్తనము విడిచిన గాక
పరమేల కలుగు నాపద లేలమాను

వేంకటపతి నాత్మవెదకిన గాక
కింక మనసున తొలగిన గాక
బొంకుమాట లెడసి పోయినగాక
శంక యేల మాను జయమేల కలుగు

Advertisement

తాజా వార్తలు

Advertisement