Sunday, April 28, 2024

అన్నమయ్య కీర్తనలు : నీడల చూపులు

రాగం : మధ్యమావతి
నీడల చూపులు నీకేలే యీ
వాడక వాడెడి వడ నీకేలే|| ||నీడల చూపులు||

నిలుపుల నటనలు నీకేలే, యీ
నిలుగుల నడపులు నీకేలే
నెలవుల కరగులు నీకేలే, యీ
కులికెడి నును సిగ్గులు నీకేలే|| ||నీవు దేవుడవు||

నెఱుల చెదరులివి నీకేలే, యీ
నెఱవగు చదురులు నీకేలే
నెఱతనపు సిరులు నీకేలే, యిదె
చెఱగున మూసెదు సఖి నీకేలే|| ||నీవు దేవుడవు||

నిక్కపు బొంకులు నీకేలే
నిక్కల గంటివి నీకేలే
నిక్కితి వొరపుల నీకేలే, యిదె
దక్కె వేంకటోత్తముడింకేలే|| ||నీవు దేవుడవు||

Advertisement

తాజా వార్తలు

Advertisement