Monday, February 19, 2024

అన్నమయ్య కీర్తనలు : ఏదితుది దీనికేది

రాగం : గోరక్‌ కళ్యాణ్‌

ఏదితుది దీని కేదిమొదలు
పాదుకొను హరిమాయ పరగు జీవునికి||

ఎన్ని బాధలు తనకు నెన్నిలంపటములు
యెన్ని వేదనలు మరి యెన్ని దు:ఖములు
యెన్ని పరితాపంబు లెన్ని తలపోతలు
యెన్ని చూచిన మరియు నెన్నైన కలవు||

యెన్ని కొలువులు తనకు నెన్ని యనుచరణలు
యెన్ని యాసలు మరియు నెన్ని మోహములు
యెన్ని గర్వములు తనకెన్నిదైన్యంబు లివి
ఇన్నియును తలప మరి యెన్నైన గలవు||

యెన్నిటికి చింతించు నెన్నిటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు
యిన్నియును తిరువేంకటేశు లీలలు కాగ
ఎన్ని చూచినను తానెవ్వడును కాడు||

Advertisement

తాజా వార్తలు

Advertisement