Wednesday, February 21, 2024

AP: శ్రీకాకుళం జిల్లాలో ఫుడ్ పాయిజన్..

ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఓ వివాహ వేడుకకు ఏర్పాటు చేసిన విందులో ఫుడ్ పాయిజన్ అయిందని తెలుస్తోంది.

ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మందస మండలం నల్లబొడ్లూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఫుడ్ పాయిజన్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement