Friday, April 19, 2024

అన్నమయ్య కీర్తనలు :కడలుడిపి నీరాడగా

ప|| కడలుడిపి నీరాడగా తలచువారలకు
కడలేని మనసుకు కడమ యెక్కడిది || కడలుడిపి ||

చ|| దాహ మణగిన వెనుక తత్వమెఱిగెదనన్న
దాహమేలణగు తా తత్వమే మెఱుగు
దేహంబు గలయన్ని దినములకును పదార్థ
మోహమేలణగు తా ముదమేల కలుగు || కడలుడిపి ||

చ|| ముందరెఱిగిన వెనుక మొదలు మఱచెదనన్న
ముందరే మెఱగు తా మొదలేల మఱచు
అందముగ తిరువేంకటాద్రీశు మన్ననల
కందువెఱిగిన మేలు కలనైన లేదు || కడలుడిపి ||

Advertisement

తాజా వార్తలు

Advertisement