Monday, May 6, 2024

అన్నమయ్య కీర్తనలు : లెండో లెండో

రాగం : చారుకేళి

లెండో లెండో మాటాలించరో మీరు
కొండలరాయనినే పేర్కొన్న దిదె జాలి || ||లెండో లెండో ||

మితిమీరె చీకట్లు మేటితలపరులాల
జతనము జతనము జతనము జాలోజాలి
యితవరులాల వాయించే వాద్యాలకంటె
అతిఘోషముల తోడ ననరో జాలి || ||లెండో లెండో ||

గాములు వారెడి పొద్దు కావలి కాండ్లాల
జాము జాము దిరుగరో జాలో జాలి
దీమనపు పారివార దీవె పంజులు చేపట్టి
యేమరక మీలో మీరు యియ్యరో జాలి || ||లెండో లెండో ||

- Advertisement -

కారుకమ్మె నడురేయి గడచె గట్టికవార
సారెసారె పలుకరో జాలోజాలి
యీ రీతి వేంకటేశుడిట్టె మేలుకొన్నాడు
గారవాన నిక మాన కద రో జలి || ||లెండో లెండో ||

Advertisement

తాజా వార్తలు

Advertisement