Friday, May 10, 2024

అన్నమయ్య కీర్తనలు : ఘుమ్మని యెడి శ్రుతి

రాగం : పూర్వీక

ఘుమ్మని యెడి శ్రుతికూడగను
కమ్మని నేతులు కాగగ చెలగె| ||ఘుమ్మని యెడి శ్రుతి||

నీల వర్ణుడని నీరజాక్షుడని
బాలుని నతివలు పాడెరో
పలు పిదుకుచును బానల కాగుల
సోలి పెరుగు త్రచ్చుచు జెలరేగె || ||ఘుమ్మని యెడి శ్రుతి||

మందరధరుడని మాధవుడని గో –
విందుని పాడేరు వెలదు లిదే
నంద వ్రజమున నలుగడ నావుల
మందల పేయల మంచిరవముల || ||ఘుమ్మని యెడి శ్రుతి||

- Advertisement -

వేంకటపతియని వేదనిలయుడని
పంకజనాభుని పాడేరు
అంకుల చేతను అలరు రవంబుల
బింకపు మాటల బృందావనమున || ||ఘుమ్మని యెడి శ్రుతి||

Advertisement

తాజా వార్తలు

Advertisement