Thursday, April 25, 2024

అన్నమయ్య కీర్తనలు : రామ రామ రామకృష్ణ

రాగం : కళ్యాణి

రామ రామ రామకృష్ణ రాజీవలోచన నీకు
దీము వంటి బంటననే తేజమే నాది || ||రామ రామ
రామకృష్ణ||

వారధి దాటి మెప్పించ వాయుజడనే గాను
సారె చవుల మెప్పించ శబరిగాను
బీరాన సీత నిచ్చి మెప్పించ జనకుండగాను
ఏరీతి మెప్పింతు నన్నెట్లా గాచేవో|| ||రామ రామ రామకృష్ణ||

ఘనమై మోచి మెప్పంచ గరుడుడనే గాను
కొన కామసుఖమిచ్చు గోపిక గాను
వినుతించి మెప్పించ వేయినోళ్ళ భోగిగాను
నిన్నెట్లు మెప్పించు నన్ను గాచే దెట్లా || ||రామ రామ రామకృష్ణ||

- Advertisement -

నవ్వుచు పాడి మెప్పించ నారదుడనే గాను
అవ్వల ప్రాణమీయ జటాయువు గాను
ఇవ్వల శ్రీ వేంకటేశ యిటునీకె శరణంటి
అవ్వల నా తెరువిదే రక్షించే దెట్లా || ||రామ రామ రామకృష్ణ||

Advertisement

తాజా వార్తలు

Advertisement