Wednesday, December 6, 2023

ఆదిత్యుడు ధర్మరాజుకు ప్రసాదించిన అక్షయపాత్ర

మహాభారత యుద్ధానికి కారణమయిన మాయాజూదంలో పాండవులు ఓడిపోయి పన్నెండు సంవత్సరాలు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. కుంతీదేవి తీవ్రంగా దు:ఖించింది. విదురుడు ఆమెను ఓదార్చి తన ఇంటికి తీసు కువెళ్ళాడు. ద్రౌపదిని జుట్టుపట్టుకుని ఈడ్చుకు వెళ్లడం, ఆమె పట్ల అసభ్య పదజాలా లు ప్రయోగించడం మొదలైనవి సభలోనున్న అందరినీ కలవరపెట్టాయి. క్రోధపూరితమైన తన నేత్రాలను వస్త్రంతో ధర్మరాజు కప్పుకున్నాడు. భీమసేనుడు తన బాహువులను ప్రద ర్శించాడు. అర్జునుడు కాలితో నేలపైనున్న ధూళిని చిమ్మాడు. నకుల సహదేవులు తమ దేహాలకు ధూళిని పూసుకున్నారు. ద్రౌపది ఏకవస్త్రధారియై జుట్టు విరబూసుకుని ఏడుస్తూ నడిచింది. పాండవుల ముందు నడుస్తున్న పురోహితుడు ధౌమ్యుడు తన చేతిలోనున్న దర్భకొనలను నైరుతి దిక్కుకు తిప్పి యమ సంబంధమైన సామ మంత్రాలను పటిస్తూ నడి చాడు. ఇవన్నీ కౌరవుల అంతాన్ని అప్పుడే సూచించాయి. అధర్మానికి ఫలం ముందుగానే నిర్ణయించబడింది. ధర్మనిష్టాపరులైన బ్రహ్మజ్ఞానులందరూ పాండవుల వెనుక బయలు దేరారు. గంగాతీరంలోని ప్రమాణం అనే పెద్ద మర్రిచెట్టు క్రింద ఒక రాత్రి గడిపి మరునాడు అరణ్యంలోకి ప్రవేశించారు. తమ కూడా వచ్చిన నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులను చూసి ధర్మరాజు పురోహితుడు దౌమ్యునితో వీరందరినీ పోషించడానికి తగిన ఉపాయం సూచించమని ప్రార్థించాడు. అంత దౌమ్యుడు ఆదిత్యుని అష్టోత్తర శతనామాలు ధర్మరాజు కు బోధించి సూర్యారాధన చేయమని తెలియచేసాడు. ధర్మరాజు పవిత్రుడై శుద్ధమైన మనస్సుతో ఏకాగ్ర చిత్తంతో ఆరాధన మొదలుపెట్టాడు. సూర్యస్తోత్రాన్ని బీజాక్షర సహితం గా పఠించడం మొదలుపెట్టాడు.
త్వం భానో జగతశ్చక్షు స్త్వమాత్మా సర్వదేహినామ్‌
త్వం యోని: సర్వభూతానాం త్వమాచార: క్రియావతామ్‌
ఓ! సూర్యదేవా! మీరు సమస్త జగత్తునకు నేత్రమును సమస్త ప్రాణులకు ఆత్మయు సమస్త జీవులకు ఉత్పత్తి స్థానము. కర్మానుష్టానపరుల సదాచారము మీరే అయి ఉన్నారు.
సమస్త సాంఖ్య యోగుల యొక్క ప్రాప్తవ్య స్థానము మీరు. కర్మయోగులకు ఆశ్రయ ము మీరు. మోక్ష ద్వారము మీరు. ముముక్షువుల గతి మీరు. సమస్త జగత్తును మీరే ధారణ చేయుచున్నారు. మీ వలననే జగత్తు ప్రకాశింపబడుతున్నది. మీరే దీనిని పవిత్ర మొనర్చు చున్నారు. మీ వలననే నిస్వార్థ భావన పాలనము జరుగుచున్నది. ఋషులచే పూజింప బడుచున్నారు. వేదతత్త్వసారము మీరే అయియున్నారు. సిద్ధులు, చారణులు, గంధర్వు లు, యక్షులు, నాగులు, మీ దివ్యరథమును అనుసరించుచున్నారు. ముప్పది మూడు కోట్ల దేవతలు, ఉపేంద్ర, మహేంద్ర సహితముగా మిమ్ములను ఆరాధించి సిద్ధిని పొందుచున్నా రు. శ్రేష్టులగు విద్యాధరులు, దివ్య మందార మాలలచే మిమ్ములను పూజించి సఫల మనో రథులై మిమ్ములను సమీపించుచున్నారు. గుహ్యకులు, ఏడు విధములైన పితృగణములు, దివ్యమానవులు మిమ్ములను ఆరాధించి శ్రేష్టపదమును పొందుచున్నారు. వసువులు, మరుత్తులు, రుద్రులు సప్తకిరణములను పానమొనర్చి శ్రేష్టత పొందుచున్నారు. వాలఖి ల్యాది సిద్ధ మహర్షులు మిమ్ములను స్తోత్రము చేసి సిద్ధిని పొందుచున్నారు.
బ్రహ్మలోక సహితమగు ఏడు ఊర్థ్వ లోకములు, ఇతర సమస్త లోకములందును మీకంటే అధికుడు ఎవరూ లేరు. జగత్తునందు మీ కాంతి ప్రభావమును మించి ఇక మహాశ క్తి లేదు. జ్యోతిర్మయ పదార్ధములన్నియు మీ యందే అంతర్గతములైయున్నవి. సమస్త జ్యోతులకు మీరు ప్రభువైయున్నారు. సత్యము, సత్త్వము, సమస్త సాత్త్విక భావములు మీ యందే ప్రతిష్ఠితములైయున్నవి. శీరాఙ్గము అను ధనస్సును ధరించిన విష్ణువు యొక్క సుదర్శన చక్రము మీ తేజస్సుతోనే విశ్వకర్మ సృష్టించెను. దానితోనే దైత్యుల గర్వమును నాశనమొనర్చుచున్నాడు, గ్రీష్మ ఋతువునందు మీ కిరణములచే సమస్త దేహదారుల యొక్క తేజమును, సమస్త ఓషధుల రస సారమును గ్రహించి, తిరిగి వర్షఋతువునందు వర్షింప జేయుచున్నారు. శీతాకాలపు గాలిచే పీడించబడిన జగత్తు మీ కిరణములచే సుఖసం తోషములను పొందుచున్నవి. మీ కిరణముల ద్వారా పదమూడు ద్వీపములతో కూడిన ఈ భూమిని ప్రకాశింపజేయుచున్నారు. మీరొక్కరే ముల్లోకములకు హితమును చేకూర్చుచు న్నారు. మీరు ఉదయించనిదే ఈ జగత్తు సర్వమూ అంధకారమయమగును. విజ్ఞులు తమ ప్రవృత్తులలో నిమగ్నులు కాలేరు. అగ్నిస్థాపన, పశుపాలన, యజ్ఞములు, తపస్సు, పూజ, అర్చన మున్నగు క్రియలన్నియూ మీ కృప చేతనే చాతుర్వర్ణములు చేపట్టగలగుచున్నారు. సహస్ర యుగములలో కూడిన బ్రహ్మదేవుని ఒక్క దినము, కాలమానము దాని ఆది అంత ములు మీరేనని బ్రహ్మజ్ఞానులు తెల్పినారు.
మన్వంతరములు, ఈశ్వరుల యొక్క ఈశ్వరుడు మీరే అయియున్నారు. ప్రళయకా లమందు మీ వలన ప్రకటనమగు సంవర్తకమను అగ్ని మూడులోకములను భస్మమొనర్చి తిరిగి మీ యందే స్థితిని పొందుచున్నవి. మీ కిరణములచే ఉత్పన్నమగు ఐరావతాది విధ వర్ణములగల మహా మేఘములు, మెరుపులు ప్రళయాంతమున సంహారము చేయుచు న్నవి. మిమ్ములను మీరే స్వయముగా పన్నెండు స్వరూపములుగా విభజించుకొని, పన్నెం డు సూర్యుల రూపమున ఉదయించి మీ కిరణముల ద్వారా ముల్లోకములను సంహారము చేయుచున్నారు. ఏకార్ణవము యొక్క జలమునంతయూ శోషింపజేయుచున్నారు. మీరే రుద్రుడు, విష్ణువు, ప్రజాపతి, అగ్ని, సూక్ష్మ మనస్సు, ప్రభువు, సనాతన బ్రహ్మము.
మీకు హంస, సవిత, భాను, అంశుమావి, వృషాకపి, వివస్వాక, మిహిర, పుష, మిత్ర, ధర్మ, సహస్ర, రశ్మి, ఆదిత్య, తపన, గవామృతి, మార్తాండ, అర్క, రవి, సూర్య, శరణ్య, దిన కృత, దివాకర, సప్తసప్తి, థామకేశీ, విరోచన, ఆశుగామి, తమోఘ్న, హరిత్వాశ అను నామ ములు గలవు.
సప్తమ్యామథవా షష్ఠ్యాం భక్త్యా పూజాం కరోతియ:
అనిర్విణ్ణో నహంకారీ తం లక్ష్మీర్భజతే నరమ్‌
ఎవరు సప్తమి లేక షష్ఠియందు, ఖేద, అహంకారరహితుడై, మిమ్ములను పూజించునో వారికి ఐశ్వర్యము లభించును. ఎవరు అనన్య చిత్తముతో మీ అభివందనము గావించు దురో, వారికి ఏ ఆపద కలుగదు. ఎటువంటి మానసిక చింతలు, రోగములు కలుగవు.
సర్వరోగైర్విరహితా: సర్వపాప వివర్జితా:
తద్భావభక్తా: సుఖినో భవన్తి చిరంజీవిన:
ఎవరు ప్రేమపూర్వక భక్తితో మిమ్ములను అర్చించెదరో వారు సమస్త రోగముల నుండి, పాపముల నుండి విముక్తులై చిరంజీవులు, సుఖవంతులు అగుదురు. ఈ విధముగా ధర్మరాజు పురోహితుడు ధౌమ్యుని సూచనలతో ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నా డు. ఆదిత్యుడు అక్షయ పాత్రను ప్రసాదించి దీనిలో వండుకున్న చతుర్విధ ఆహారాలు ద్రౌప ది వడ్డిస్తున్నంత సేపు అక్షయమవుతాయి. నేటి నుండి పధ్నాలుగవ సంవత్సరంలో నీ రాజ్యం నీకు లభిస్తుందని పలికి అంతర్థానమయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement