Monday, April 29, 2024

స్వర్ణ కలశస్థ శ్రీకళ్యాణి!

శ్రీహరి మనోహరి! సకల శుభశ్రీకరి!
చల్లని వరాల తల్లి! దయామృతాలవెల్లి!
సకల జగాల సదాబ్రోచు ”శ్రీకల్పవల్లి!
అష్టైశ్వర్య ప్రదాయని! శ్రీ వరలక్ష్మీ శరణు!!

శ్రావణ పౌర్ణమి పూర్వ శుభ శుక్రవారాన-
సకల భక్తులబ్రోవ వెలసిన జగజ్జనని!
శుభదాయిని! వరదాయిని! విశ్వకళ్యాణి!
శ్రీ వరలక్ష్మీదేవి-
భువిని స్వర్ణమయం చేయుమమ్మా!!

ధవళ వస్త్రాలు తాల్చి- శ్వేతపుష్పాలకొలిచి,
క్షీరపాయసాదుల భక్తితో నైవేద్యమిచ్చి,
సద్గుణమణి ”చారుమతి” భక్తికథ పఠించిన
భక్తులకు ‘శ్రీవరలక్ష్మి’ కొంగుబంగారమౌగాక!!

సకలాభీష్టదాయిని! సౌభాగ్య ప్రదాయిని!
అఖిల భారతావని- సస్యశ్యామలం చేయుగాక!
తెలుగునాట- పంటసిరులు కురిపించి,
చల్లని ”శ్రీవరలక్ష్మీదేవి!” రైతన్నల సాకుమమ్మ!

శ్రీవైకుంఠ వాసిని! శ్రీ మహావిష్ణు హృదయరాణి!
త్రిలోక జనని! దివ్యమంగళ స్వరూపిణి!!
‘శ్రీ చక్ర’- విరాజ- స్వర్ణ కలశస్థ శ్రీకళ్యాణి!
చల్లని ”శ్రీ వరలక్ష్మీదేవీ!”
భక్తుల సదా బ్రోవుమమ్మా!!”

- Advertisement -

– కళ్యాణశ్రీ
9640321630

Advertisement

తాజా వార్తలు

Advertisement