Wednesday, April 24, 2024

మెగాస్టార్ కు విశాఖ అభిమానుల ముందస్తు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి విశాఖపట్నం తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ప్రతి సినిమా షూటింగ్ కూడా విశాఖలో మెగాస్టార్ చిరంజీవి జరిపేవారు. ఇక అక్కడి నుంచి కూడా విశాఖలో షూటింగ్ జరిపితే హిట్ కొట్టడం ఖాయం అనేది ఆనవాయితీగా మారింది మెగాస్టార్ కు. అయితే అసలు విషయానికొస్తే ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు పురస్కరించుకొని వైజాగ్ లో అభిమానులు సేవా కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా నిర్వహించే వారు. దాదాపు 250 మంది చిరంజీవి అభిమానులు రక్తదానం చేసే వారు.

అలాగే సుమారు మూడు వేల మొక్కలను నాటేవారు. అయితే ఈ సందర్భంగా వారంతా కలిసి చిరంజీవికి విశాఖ సాగరతీరంలో ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒకటిన్నర నిమిషాల వీడియో కట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement