Monday, April 29, 2024

సంతాన వరదాయిని గరుడ పంచమి

శ్రావణ శుక్ల పక్ష పంచమి ”నాగ పంచమి”తోపాటు ”గరుడ పంచమి” అని కూడా పిలుస్తారు. ఇది సర్ప పూజ ఉద్దిష్టమైన రోజు. నాగులకు, ఆంధ్రులకు ప్రాచీన కాలమునుండి విశేష సంబంధముంది. భారతావనిలో అనేక ప్రదేశాలలో నాగజాతి వారున్నట్లు చరిత్ర చెబుతున్నది.
ఈరోజు నాగుల నుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లల ను కాపాడుకొనేందుకు, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలు పుట్టడం కోసం గరుడ పంచమి నాడు గరుడ పూజ చేయ డం ఆచారంగా ఉంది.
మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్త సము ద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్క ల బలం కలవాడు. అందుకే గరుడునికి సుపర్ణుడు అనే పేరు సార్ధక మైంది. గరుత్మంతుడు మహా విష్ణువుకు వా#హనంగా ప్రసిద్ధుడు. మహాబలశాలి. వ్యాస మ#హర్షి విరచిత అష్టాదశ పురాణాలలో మరణానంతర నరక లోక వర్ణన, పాపాలకు విధించబడే శిక్షలు, ప్రాయశ్చిత్తాలు, పుణ్యసాధనా మార్గాలు, పితృకార్య వివరాలతో 18 వేల శ్లోకాలు గల గరుడ పురాణం ఒకటి. అధర్వణ వేదంలో గరుడోపనిషత్తులో విషదహార అని వైనతేయ ప్రస్తావన ఉంది. గరుడ పంచమి ప్రస్తావన భవిష్యత్‌ పురాణంలో ఉంది.
సముద్ర మధనంలో ‘ఉచ్పైశ్రవం’ అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు, వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చూశారు. కద్రువ, వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా, వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఒక పందెం వేసుకొన్నారు. గుఱ్ఱపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్దితో, తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా. దానికి వారెవ్వరు అంగీక రించలేదు. అందుకు కోపగించిన కద్రువ ”జనమేజయుని సర్ప యాగంలో నశించాలని” శపించింది. కర్కోటకుడు అనే కుమా రుడు అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు.
కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువకు సంతాన ప్రాప్తికై పుత్ర కామేష్టి యాగం చేసిన ఫలితంగా, సతుల కోరికలపై కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువ అండాల నుండి వాసుకి, ఆదిశేషుడు, ఆదిగా వేయి పాము లు జన్మిస్తాయి. వినత తొందరపడి ఒక అండాన్ని చిదమగా కాళ్ళు లేని, మొండెం మాత్రమే గల అనూరుడు జన్మిస్తాడు. దానితో తన సవతికి, తన తల్లి దాసీగా ఉండాలని అనూరుడు శాపమిచ్చి, రెండ వ అండం జాగ్రత్తగా దాచితే, దానినుండి జన్మించినవాడే దాస్య విముక్తి కలిగిస్తాడని చెపుతూ, సూర్యునికి అనూరుడు రథసారధి గా వెళతాడు. తర్వాత గరుత్మంతుడు జన్మిస్తాడు. శ్రావణ శుద్ధ పంచమినాడు గరుత్మంతుడు అమృతాపహరణం చేసినందున గరుడ పంచమి అనే పేరు వచ్చింది. గరుడుడు అమృతం తెచ్చి తన సవతి తల్లికి ఇచ్చి కన్నతల్లికి దాస్య విముక్తి గావించాడు. అయితే ఇంద్రునితో గరుడుని ఒడంబడిక కారణంగా, అమృతం నాగులకు లభించలేదు. కనుక వారు అసంతృప్తులైనారు. అసంతృప్తులైన నాగులకు తృప్తి కలిగించడానికి వాటికి పూజలు జరపడం విరోధితో జతపడిన పర్వంగా భావిస్తారు. పురాణగాథలు చూస్తే నాగులకు, గరుడుడికి విరోధమున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విరోధంలో గరుడుడు విజేతగా నిలుస్తాడు. భారతదేశంలో కొన్నిచోట్ల గరుడు డు పరాజితుడైనట్లు గాథలున్నాయి. గరుత్మంతుడికి, నాగరాజైన తక్షకునికి ఒకసారి యుద్ధం జరగగా, గరుడుడు ఓడిపోవడం జరి గింది. నాగ ప్రతిమ గల యంత్రపు బిళ్ళను మెడలో వేలాడ తీసు కుని ఉండే షరతుపై ఇరువురికి రాజీ కుదిరింది. వంగదేశంలో ఈ పురాణ కథ ఉంది. సర్పరాజుకు, గరుత్మంతుడు నమస్కరిస్తూ ఉన్నట్లు శిల్ప ఖండాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వ్రత రత్నాకరంలో గరుడ పంచమి ప్రస్తావన ఉంది. పంచాంగాల్లో సైతం నాగ పంచమి, గరుడ పంచమి రెంటినీ పేర్కొంటారు. వైష్ణవాలయాలలో ఆ వాహనాలు ఉండడం వాటి మీద స్వాముల ఊరే గింపులు జరపడం పరిపాటి. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే, ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూ ర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉంటాడు. దాని అంతరార్ధం ”స్వామి నా కర్తవ్య నిర్వహణ కోసం నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే” అని.
సర్వశక్తి సంపన్నుడు అయి ఉండీ, సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను ఓర్చి, తల్లికీ, తనకూ గల దాస్య బంధనా లను తెంపి, మహావిష్ణువుకు వాహనంగా వినుతికెక్కిన వినతా పుత్రుడైన వైనతేయుడు ప్రాత:స్మరణీయుడు.
నాగ పంచమి

శివుడు పార్వతికి నాగ పంచమి పర్వాన్ని గురించి చెప్పి నట్లు పురాణ కథనం. ఈ పర్వదినం నాడు ఇంటి గడపలకు ఇరుపక్కలా గోమయంతో నాగుల మూర్తులు ప్రతిష్ఠించి, 12 ఏళ్ళు విడవకుండా వ్రతాన్ని ఆచరిస్తే గొప్ప పుణ్యం. ఐదు తల ల పాములను వెండితో గాని, మట్టితోనైనా చేసి పూజించడం ఆచారం.నాగపంచమినాడు బతికి ఉన్న పామును చూస్తే అదృ ష్టమని భక్తులవిశ్వాసం. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కం బల, కర్ణాటక, అశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్ష క, పింగళి అనే 12రకాల సర్పాలను ఒక్కొక్కనెలలో పూజించ డం ప్రాచీన సంప్రదాయంగా ఉండేది.
ప్రపంచంలో శాస్త్రవేత్త లకు తెలిసిన దాదాపు అన్ని రకాల పాములున్న దేశం భారతదేశమే. తమిళులు శ్రావణ శుద్ధ పంచమినాడే నాగపూజలు చేస్తారు. కాశీలో శేషుని అవతారం గా భావించే పతంజలిని ఈరోజే పూజిస్తారు. మానవుని మాన సిక శక్తికి పాము చిహ్నం. మానసికశక్తికి వేదాంత పరిభాషలో కుండలినీశక్తి అనిపేరు. కుండలినిని సర్పంటైన్‌గా పిలుస్తారు. మూలాధారం నుండి సహస్రారం వరకు వెన్నెముక మధ్య నుండి సర్పాకారముగ కుండలినీ శక్తి అనే సుషుమ్నా నాడిని లేవజూపడమే నాగ పూజ ప్రధానోద్దేశ మని విజ్ఞుల భావన.
– రామ కిష్టయ్య సంగనభట్ల
94405 95494

Advertisement

తాజా వార్తలు

Advertisement