Saturday, May 11, 2024

సంకల్ప ప్రయత్నమే సగం బలం!

ఒక ఊరిలో ఒక గబ్బిలం వుండేది. పైకప్పుకు కాళ్ళు పెట్టుకుని రాత్రిపూట తలక్రిందులు గా వేలాడబడి వుంటుంది. ఎక్కువగా చీకట్లో, గుహల్లో వుంటుంది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకునిపొయాయి. అప్పుడు ఆ గబ్బిలం ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చిపోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకుపోయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. సముద్రుడిని శుష్కింపచేయాలని. తన గుడ్లు కొట్టుకుపోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలుపెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో పక్షులు ఎవరి మాట వినలేదు.
ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశదేశాల నుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసు లో ఎంత ఉత్సాహం! ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమై వున్నాయట. ”పద నేను చూస్తాను” అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వ కంగా చేస్తాడో అ ప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తి కూడా దొరుకుతుంది. బుద్ధి కూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగట మే కావలసినది. సహాయం చేసేవా రు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడు డు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు.
”ఓ సముద్రమా! మావా రంతా ఇన్ని పక్షులు సంకల్ప బలం తో నిన్ను శుష్కింప జేయాలనుకుం టున్నారు. నీవేమో ఇవి నన్నేం చేస్తా యి? క్షుద్రమైన పక్షులు అనుకుంటు న్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!” అని గరుడుడు సముద్రము పైన తన రెక్కలతో రెండు మూడుసార్లు బలంగా ప్రహారం చేశాడు. ఆ రెక్కల గాలికి సముద్రుడు అల్లకల్లోలం అయిపోయాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. గబ్బిలపు గుడ్లను తెచ్చి ఇచ్చాడు. దానికి తన గుడ్లు లభించాయి. దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తి కొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసే వాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆ పని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సా#హంతో ఉండకూడదు. అందుకనే భగవంతుడంటాడు ”ఓ బుద్ధిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement