Monday, April 29, 2024

శ్రీశైలలంలో కనులపండువగా లక్ష దీపోత్సవం

పుష్కరిణి హారతి.. పోటెత్తిన భక్తులు
శ్రీశైలం, ప్రభ న్యూస్‌: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వ హించారు. కార్తీక మొదటి సోమ వారం సందర్భంగా సాయంత్రం పుష్కరిణి వద్ద దేవస్థానం వారు ఏర్పా టు- చేసిన లక్ష దీపోత్సవం పుష్కరిణి హారతి కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష దీపోత్సవ కార్యక్ర మం కార్తీకమాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి రోజు దేవస్థానం వారిచే నిర్వహించబడు తున్నది. కార్తీకమాసంలో దీపారాధన చేయడం ఎంతో ప్రాముఖ్యమైనదని వేదాలు చెబుతున్నా యి. వేద పండితులు అర్చకులు దేవస్థానం అధికారులు భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉత్సవ మూర్తులకు పుష్కరిణి వద్ద విశేషపూజలు, హారతులు ఇచ్చారు. కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వహణాధికారి లవన్న, ఏఈఓ హరిదాసు. పర్యవేక్షకులు. అయ్యన్న. శ్రీశైలప్రభ ఎడిటర్‌. అనిల్‌. పిఆర్‌ఓ. శ్రీనివాసులు. శ్రీశైల భద్రత అధికారి. నరసింహారెడ్డి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల మహాక్షేత్రం
భక్తులు తెల్లవారుజామునే నదీ పుణ్య స్నానాలు ఆచరించి భ్రమరాంబ దేవి మల్లికార్జు న స్వామి అమ్మవార్లను బారులుతీరి దర్శించుకున్నారు. ఒకవైపు భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దేవస్థానం కార్యనిర్వాహణాధి కారి ఎస్‌ లవన్న ఆదేశాలతో క్యూలైన్లలో దర్శ నార్థం వేచిఉన్న భక్తులకు పాలు, బిస్కెట్లు-, మంచినీరు, ఫలహారాలు అందించారు. మరోవైపు క్యూలైన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement