Sunday, May 19, 2024

శక్తి కేంద్రాలు ఆలయాలు

మానవుడు ధర్మమార్గంలో పయనించడానికి తెలుపబడిన సులు వైన మార్గాలు మన హిందూధర్మంలో అనంతంగా నిక్షిప్తంగా వున్నాయి. మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలకూ భక్తి చింతనలో మోక్షసాధనలో వచ్చే అడ్డంకులకు మన జ్ఞాన భాండాగారంలాంటి పవిత్ర గ్రంథాలు సమాధానాలిస్తాయి.
మానవుడు వ్యక్తి కాదు. శక్తి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకుని ఆ శక్తి తనలో ఎక్కడ దాగుందో వెతుక్కోవాలి. దానికి ఎంతో సాధన చేయాలి. గొప్ప తపస్సు ద్వారా, ఉపాసన ద్వారా మా త్రమే వ్యక్తి శక్తిగా మారగలడు. మనం మన హైందవ ధర్మం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తాం. రోజూ లేదా వారం వారం గుడికివెళ్తాం. ఇలా ఎందుకు చేయాలి? అని మనల్ని మనం ప్రశ్నించు కున్నా లేదా అసలు గుడికి ఎందుకు వెళ్లా లి? పూజలు ఎందుకు చేయాలి? అని ఇత రులు (మన మతంలోని నాస్తికులు కావ చ్చు లేదా ఇతర మతస్తులు కావచ్చు) మన ల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలిగే జ్ఞానం ప్రతీ హిందువుకి రావాలి… కావాలి.. వుండాలి.
గుడులన్నీ శక్తి కేంద్రాలు. ప్రత్యేకంగా కొండలపైన వెలసిన గుళ్లన్నీ అత్యంత గొప్ప శక్తిపీఠాలు లేదా శక్తి కేంద్రాలుగా పరిగణింపబడతాయి. అందుకే మన హిందూ ధర్మంలో తీర్థయాత్రలకు పెద్దపీట వేసారు. శక్తిని ఉపాసించుటకు భక్తియే ప్రధాన మార్గం. ఈ మార్గంలో ప్రతీ మానవుడు పయనించి తనలో సూక్ష్మంగా నిక్షిప్తమైన అణువంతటి రూపంలోని శక్తికేంద్రాన్ని వెలికితీయాలి. ఎలాగైతే నేడు మన అరచేతిలోని చరవాణు లను నిత్యం చార్జింగ్‌ చేస్తున్నామో సరిగ్గా మనం అలాగే మనలోని శక్తి తగ్గినప్పుడు లేదా క్షీణించినప్పడల్లా లేదా తరిగిపోయినప్పుడల్లా దగ్గర లోని దేవాలయాలకు వెళ్లాలి. అక్కడున్న పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ వంటి దేవీదేవతామూర్తులను పూజించాలి. ఇది రోజూ చేస్తారా లేదా వారం వారమా అనేది ఎవరి వీలునుబట్టి వారు అనుసరించాలి. అలా పూజించ డం వల్ల ఆ పెద్ద శక్తి కేంద్రం (గుడి) నుండి మనలోవున్న చిన్న శక్తి కేంద్రానికి చిప్‌ శక్తి విద్యుత్‌ శక్తిలా ప్రవహిస్తుంది. ఆ వచ్చిన శక్తిని మానవుడు తన కొరకు కొంత, సమాజానికి కొంత వినియోగించుకోవాలి. మళ్లిd ఎప్పటికప్పుడు తనలో తరిగిపోయిన శక్తిని పునరుద్ధరించుకోవాలి.
ఆవిధంగా ప్రతీ హిందువూ, ప్రతీ వ్యక్తీ సాధన చేస్తూ తనను తాను శక్తి వంతంగా మార్చుకుని యువత హిందూమతాన్ని శక్తివంతం చేస్తూ పోవాలి. ప్రపంచంలో హిందూమతం అనితర అత్యంత గొప్ప విశేష శక్తిగా శాశ్వతంగా వెలిగే అఖండ జ్ఞానజ్యోతి కావాలి. మనలో ఎన్నో భయాలు, బాధలు, ఆవేశాలు, ఆనందాలు, ఆందోళనలు నిత్యం ఉద్భవిస్తాయి. వాటిని నియంత్రించాలంటే చంచలమైన మనసుని కట్టడి చేయాలి.
గుడి అనే శక్తి కేంద్రంలోకి ప్రవేశించి, ఆ పవిత్ర ప్రదేశంలో కూర్చుని మనలోని నకారాత్మక ఆలోచనల్ని సాధనతో, ప్రయత్నంతో నివారించు కోగలం. భగవత్‌ నామ జపం వల్ల అనంతమైన ఏకాగ్రతను పొందగలం. స్వామి దర్శన వీక్షణ చేత మంత్ర శ్రవణం చేత, తీర్థప్రపాద వితరణ సేవనం చేత మన మనసులో వికారాలన్నీ తొలగి పోతాయి. నిర్వికారమైన మనసు నిత్యానందంగా, నిశ్చలంగా, నిర్మలంగా నిరంతరం లోకకల్యాణం కొరకు స్వామి కార్యం కొరకే ఆలోచిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement