Saturday, May 4, 2024

వెూక్షం శరణం గచ్ఛామి..!

మోక్షం అంటే సంయోగం. మన మనస్సును భగవంతు నిలో కలిసిపోవడం. మోక్ష సాధనం మనిషి శరీరంలో సాధించే అద్భుతమైన ప్రక్రియ. అది మిగిలిన ఏ జీవికి వీలుకాదు. మనిషి దారేషణ. ధనేషణ, పుత్రేషణ అనే బలీయమైన కోర్కెలచే బంధింపబడతాయి. ఇవన్నీ మోక్షగామికి తృణ ప్రాయం..!!
భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన సమస్త జీవరాశులలో ఉంటాడు. మన అందరి హృదయాలలో ఉన్నాడు. అజ్ఞానంతో మానవులు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. పరి పరివిధాల పరిభ్రమిస్తుంటారు.
యజ్ఞ, దాన, తప:, కర్మాత్మకమైన ధర్మం స్వర్గకాములకు మాత్రమేగాక, మోక్షకాములకు కూడా అనుష్టేయం అని మను స్మృతిలో కలదు. ధర్మాచరణం మోక్ష ప్రతిబంధాల్ని తొలగిస్తుంది.
”సర్వ భూతేషు చాత్మానం, సర్వ భూతాని చాత్మని
సమం పశ్యన్నాత్మయాజీ, స్వారాజ్య మధిగచ్ఛతి”
సర్వ భూతాలందు ఒకే ఆత్మ కలదనియు, పరమాత్మయందే సర్వ భూతాలు వున్నవనియు, గుర్తించుచు, సర్వ కర్మలను, బ్రహ్మార్పణంగా చేయువాడు, మోక్షాన్ని పొందుతాడు. తాత్కాలికానంద ద్యోతకములైన సిద్ధులను, జ్ఞాని వదిలివేసి, కేవ లం మోక్షానంద పదవినే పరమావధిగా పెట్టుకొనుచుండును.
”సత్యం, దమ: తప: శౌచం సంతోషో హ్రీ: క్షమార్జనమ్‌
జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతన:”
సత్యం, ఇంద్రియ, నిగ్రహం, తపస్సు, శుచిత్వం, సంతోషం. సిగ్గుపడడం, ఓర్పు, ఋజత్వం, జ్ఞానం, దయ, ధ్యానం ఇదియే సనాతన ధర్మాలు. ఈ ధర్మం ప్రకారం మోక్షాన్ని పొందినచో జన్మ సాఫల్యం సిద్ధించును.
మానవ జన్మ పూర్వ జన్మ సుకృతం. ఈ మానవ జన్మ మోక్షం ద్వారా సాఫల్యమవుతుందంటారు. మోక్ష సముపార్జన చాలా మందికి క్లిష్టమైంది. మోక్షమంటే భౌతిక పరమైనవిగా భావించే వారికి అలౌకిక మోక్షం క్లిష్టమైంది గానే కాదు. అసాధ్య మైనదిగా కూడా కనబడుతుంది. అలౌకిక మోక్షం శాశ్వతమని తెలుసు కోవాలన్నా, మనిషి బతుకు వికసించాలన్నా, ఎటు వంటి ప్రలోభాలకు లోనుకాకుండా మోక్షం సంపాదించడమే ఏకైక మార్గం.
మోక్షం భగవంతుని చేరువయ్యే ఏకైక మార్గం. మనిషిలో భగవం తుడు కోరుకునేది కూడా అదే. కానీ- మనిషి చేస్తున్నదే మిటి? ఇహ సుఖ భోగా ల అన్వేషణలో పావులా మారి నిత్యం తన జీవితా న్ని ఎలా సాగించాలి?
సుఖ జీవన బాటలను వెదికే పనిలో అహర్నిశలు తల మునకలై ఉంటాడు. మనిషిలో దైవ త్వం లేకపోగా, కనీసం మానవత్వం కూడా కనుమరుగై పోతుంది. పశుత్వం, పైశాచిక త్వం అన్నవే ఈ మానవ సమా జంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవే మోక్షానికి అడ్డుగోడలుగా నిలుస్తాయి.
బహిర్ముఖమైన మనసు మోక్ష సాధన ద్వారా స్పృహతో తమ స్వస్థానమైన హృదయంతో లయమయ్యే స్థితే సమాధి. లయం కావడమంటే నిశ్చింతగా మనస్సు ఉండడం. ఆ స్థితి ఆత్మకు ఏర్పడి నప్పుడు సంకల్పాలు ఉండవు. కానీ మనసు సంపూర్ణంగా లయం కానందున తన ఉనికిని కోల్పోదు.
”మోక్ష ద్వారే ద్వారపాలా: చత్వార: పరికీర్తితా:
శమో విచార స్సంతోషశ్చతుర్థ: సాధు సంగమ:”
మోక్ష ద్వారానికి- శమం, విచారం, సంతోషం, సాధు సంగ మం అను నలుగురు ద్వారపాలకులుగా ఉంటారట. తద్ద్వారానే మోక్షం సులభమవుతుందని మనుస్పృతి పేర్కొంటుంది.
ఏ బోధ, ఏ విశ్వాసం, ఏ జీవన సరళి, ఏ ఆధ్యా త్మిక సాధన మోక్ష గామికి, శాంతి, ప్రకృతి ప్రసా దిత సహజ సంపద స్థిరత్వం అనుకూలమవు తాయో వివిధ మత బోధన లనూ, వాటి చరిత్రలనూ విశ్లే షిం చు కుంటే మంచిది. తాత్కాలికానంద ద్యోతకములైన సిద్ధులను జ్ఞాని వదిలివేసి కేవల మోక్షానంద పదవినే పరమావధిగా పెట్టుకొనును.
”ప్రవృత్తం కర్మ సంసేవ్య దేవానామేతి సామ్యతామ్‌
నివృత్తం సేవ మానస్తు భూతాన్యత్యేతి పంచవై.”
ప్రవృత్త కర్మ ఆచరించడంవల్ల సామాన్యమైన ఐహికా ముష్మిక సుఖాలు కలుగుటయే గాక, దేవతలతో సమానత్వం కూ డా కలుగును. నివ ృత్త కర్మ ఆచరించువాడు తుదకు శరీరోత్పత్తికి కారణాలైన పంచ భూతాల్ని ఆక్రమించును. అంటే మోక్షాన్ని పొం దునని అర్థం. విరాట్స్వరూపమైన అణువు సృష్టిగా ఉండి, జడత్వ రహితమై, జన్మాంత మందు తిరిగి ఆ విరాడ్రూపంలో లీనం కాబడు టయే సాయుజ్యం. అదే మోక్షం. భౌతికంగా ఉన్న శ్వాస, రస స్వరూ పమైన శ్వాసగా మారినప్పుడే ముక్తి యొక్క మహత్తరమైన విష యం తెలియబడుతుంది.
”సుఖాభ్యుదయికం చైవ నై: శ్రేయసిక మేవచ
ప్రవృత్తం చ నివృత్తం చ ద్వి విధం కర్మ వైదికమ్‌..”
వైదిక కర్మలు రెండు రకాలు అనుకొంటే- ఒకటి ప్రవృత్త కర్మ, రెండు నివృత్త కర్మ. స్వర్గాది సుఖాల నిచ్చి సంసారంలో నిలబెట్టేది ప్రవృత్త కర్మ. మోక్షాన్నిచ్చేది నివృత్త కర్మ. ప్రవృత్త కర్మ స్వర్గాది వాంఛలతో చేయబడుతుంది. నివృత్తకర్మ మోక్షాభిలాషతో చేయ బడుతుంది.
”ఇహచాముత్ర వా కామ్యం ప్రవృత్తం కర్మ కీర్త్యతే
నిష్కామం జ్ఞానపూర్వంతు నివృత్తము పదిశ్యతే”
ఈ లోకంలోకాని, స్వర్గాది లోకాలలోకాని, సుఖం అనుభ వింపవలయుననే కోరికతో చేయబడే కర్మ ప్రవృత్త కర్మ కదా. నిష్కా మముగానూ, జ్ఞానాభ్యాస పూర్వకంగానూ ఆచరింపబడు కర్మ నివృత్త కర్మ కాబట్టి జ్ఞానంచేత ఆత్మ ముముక్షత్వాన్ని పొందు తుంది. ముక్తిపొందని జీవం మరణరూపంతో నాశనమవుతుంది. స్వల్ప జీవియగు మానవుడు తాను బ్రతికియుండగానే ముక్తి మార్గం తెలుసుకోవాలి గాని మరణించిన తర్వాత కాదు. బ్రహ్మ జిజ్ఞాసచే జీవన్ముక్తి బడయుటలోని మానవ జన్మకు చరితార్థం. విశే షంగా ఉంటుందని విజ్ఞులు అంటారు.

– ఎస్‌ ఆర్‌ భల్లం
98854 42642

Advertisement

తాజా వార్తలు

Advertisement