Friday, May 17, 2024

మేలు మరువనివాడు ధన్యుడు!

అన్ని జన్మలలోనూ మా నవ జన్మ ఉత్తమోత్తమమైన దని పెద్దలు అంటుంటారు. ఎందు కంటే మోక్ష సాధనకు అత్యంత సులభమై నది.విజ్ఞతతో వుండడానికి, మంచి పనులు చేయడానికి… ఎవరినుం చి అయినా సహాయం స్వీకరిస్తే దాన్ని మరిచిపోకుండా వెంటనే కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం కూడా మా నవుడికే వుంటుంది. దేవతారాధన, పరోపకారం… ఇలా ఒకటేమిటి అనేక మంచి కార్యాలను చేయడానికి బృహత్తరమైనది మానవ జన్మ. దేవుడు ప్రసాదించిన జన్మను సార్థకం చేసుకోవాలి. మన పురాణ పురుషుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి.
సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారం అయినా మానవు డుగా అవతరించినందుకు మానవుడు చేయవలసిన ధర్మ విధులన్నిటినీ నెరవేర్చాడు. ఈ పృథ్విలోనే ఆద ర్శమూర్తి అయ్యాడు. మనుషులు ఎవరి దగ్గర నుంచి అయినా సరే పొందిన మేలును మరువరాదని చాటి చెప్పాడు. ఎందుకంటే ఆయన ఇతరుల నుంచి పొంది న సహాయాన్ని, వారు చేసిన మేలును ఎన్నడూ మరచి పోలేదు. సీతను రావణుని నుండి కాపాడే యత్నంలో ప్రాణాలు వదిలిన జటాయువు పక్షికి అపరకర్మలు నిర్వ #హంచాడు.
రావణునితో జరి గిన సంగ్రామంలో మర ణించిన వానర జాతికి మోక్ష ప్రాప్తి కలిగించాడు. సీతమ్మ జాడను తెలిపిన భక్తాగ్రేసరుడు హనుమంతుని నిండుసభలో ”హనుమ నాఆత్మ” అని ప్రకటిం చి అక్కున చేర్చుకున్నాడు. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో, అనురాగంతో ఎలా ఉండా లో శ్రీరాముడు, సీత దంపతులు లోకానికి చాటారు. దాంపత్య ధర్మాన్ని ఎలా ఆచరించాలో ఆచరించి చూ పారు. తన పట్ల విధేయతతో, స్వంత అన్నగారు అయి నా సరే రావణాసురుడి దుష్టచర్యను వ్యతిరేకించి ధర్మం పక్షాన నిలిచిన విభీషణుడిని తాను గెలిచిన లంకా రాజ్యానికి రాజును చేశాడు. అందుకే మన సనా తన సంస్కృతిలో ప్రతీ తల్లిదండ్రులు తమ పుత్రులు శ్రీరాముడు, లక్ష్మణ, భరత, శతృ ఘ్నుల్లా ఉండాలని కోరుకుంటారు. ప్రతి భార్య తన భర్త శ్రీరామునిలా , ప్రతి భర్త తన భార్య సీతలా ఉం డాలని కోరుకుం టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement