Wednesday, May 15, 2024

బ్రహ్మాకుమారీస్‌.. పోటీ పడుతున్నాము కాని పరిగెత్తలేకపోతున్నాము(ఆడియోతో…)

కొంతమంది చాలాసార్లు తనకంటేఎక్కువ గౌరవం లభించే మహారథి, జ్ఞాని సోదరులను చూచి ”వాళ్ళలో కూడా ఫలానా ఫలానా లోపాలున్నాయి. వాళ్ళు కూడా ఎనిమిది గంటలు ఈశ్వరీయ స్మృతిలో ఉండలేకపోతున్నారు. నేనైతే ఇంకా ఈ జ్ఞాన రంగంలో ఆయన కంటే చిన్నవాడిని. వెనుక వచ్చిన వాడిని. నాలో ఫలానా లోపముంటే ఏమి? పెద్ద వాళ్ళు కూడా ఇలా చేస్తే మేమింకా చిన్నవాళ్ళం మేము చేస్తే తప్పేమీ? ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళలో పెద్దరికం వాళ్ళలో లోపమున్నందుకు కాదు. ఏ విషయంలో వాళ్ళు గొప్పగా ఉన్నారో దానిలోనే వాళ్ళు పెద్ద. దేని గురించి లోపముందో వాళ్ళు ఆ విషయంలో చిన్నవాళ్ళే. వాళ్ళు కూడా దానిని తొలగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు అని గ్రహించాలి. ఏ లోపం వలన వాళ్ళు ఇపుడు చిన్నతనంలో ఉన్నారు. దానిని చూచి నా నుండి ఆ లోపాన్ని పోగొట్టుకొనాలా? లేక ఇంకా నిర్యం చెందాలా? పెద్దలలోని ఈ లోపం మన క ళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడ ఒక వేళ మనలో కూడా ఈ లోపం ఉంటే ఇతరులకు కూడా నచ్చదని గ్ర హించాలి. మనం ఇతరులలోని చెడును అనుసరించి మన రిజిష్టర్‌ పాడు చేసికొనాలా? లేక మన దైహిక మాతా పితలను మకంటే ముందు వచ్చిన వారిని చూడాలా? నిరాకారుడు అయిన పరమపిత శివ పరమాత్ముడే ఒకే ఒక సంపూర్ణాత్మ.ఆయనను చూచి మన పురుషార్థమును ముందుకు సాగింపజేయాలి. మనకం టే ఎక్కువ విలువ పొందిన వ్యక్తులతో లేక పెద్దవారి నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి? చెడ్డతనమా? గొప్పతనమా? మనం వారి నుండి కూడా మంచినే తీసికొని మనం కళలను పెంపొందింపచేసినాలనుకొంటే వారి చెడును చూడను కూడా చూడరాదు. వారితో గూడా రేస్‌ చేసి ముందుకు సాగిపోయే శుభసంకల్పం మనసులో పెట్టుకొనాలి.
ఇదేవిధంగా ఈశ్వరీయ స్మృతి మరియు అవ్యక్త స్థితిని సాధించే ప్రశ్న ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతమైన పురుషార్థం పైన నిరంతరం ద్యాస వహించాలి. మనం రిజిష్టరును సదా ఎదురుగా పెట్టుకొనాలి. మన చార్టులో ఈశ్వరీయ స్మృతి పెంచుకొనే పురుషార్థంలో నిమగ్నమై ఇతరులను కూడ వినయవిధేయతలతో జాగృతి చేయాలి అంతేగాని వారు నష్టపరుకొంటుంటే చూచి తమను తాము నష్టపరచుకొనరాదు.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement