Monday, April 29, 2024

ప్రేమ… అనిర్వచనీయమైన స్పందన

వాల్మీకి ఆది కావ్యమైన రామాయణంలో శ్రీ సీతారా ముల పవిత్ర చరిత్రతోబాటు మానవునికుండవల సిన ఉత్తమ గుణాల గురించి విడమర్చి చెప్పాడు. గోస్వామి తులసీదాసు కూడా తన రామ్‌చరిత్‌ మానస్‌లో మనిషి ఆచరించదగ్గ గుణగణాల గురించి వివరించాడు.
బాలకాండలో శివుడు పార్వతికి ప్రేమ స్వభావాన్ని గురిం చి బోధించినట్టు చెబుతూ ఈ పద్యాన్ని ఉదహరించాడు తులసీ దాసు.
బడే సనేహ్‌ లఘున్హ్‌ పర్‌ కరహీఁ
గిరి నిజ్‌ సిరని సదా తృన్‌ ధరహీఁ
జలధి అగాధ్‌ మౌలి బహ్‌ ఫేనూ
సంతత్‌ ధరని ధరత్‌ సిర్‌ రేనూ
”మనిషి తనకంటే చిన్నవారిపై చూపే ప్రేమ గుణాన్ని బట్టే ఆయన గొప్పతనం వ్యక్తమవుతుంది” అంటూ తులసీదాసు ”ఎత్తైన కొండ తన తలపై గడ్డిమొలిచే అవకాశాన్ని కలిపించి తన ఉదార ప్రభావాన్ని చాటుకుంటుంది. గంభీరమైన సము ద్రం తన శరీరం మీద నురగ ఏర్పడడానికి దోహదపడి తన ఔదార్యాన్ని చూపుతుంది. భూమి తన దేహం మీద ధూళి కణా లు పరచబడడానికి చోటిచ్చి తనలోని విశాల భావాన్ని కనబర ుస్తుంది” అని చెప్పాడు.
తనకంటే కిందిస్థాయిగలవారిపై చూపే ప్రేమ గుణంతోనే వ్యక్తి యొక్క స్వభావం ఎలాంటిదో తేటతెల్లమవుతుందని పద్యంలోని అంతరార్థం.
”ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య కలిగే భావోద్రేకమో, శారీరకమైన ఆకర్షణో తప్ప మరొకటి కాదని చాలామంది అను కుంటూ ఉంటారు. దేహ భారం నుంచి శారీరకమైన మోహాల నుంచి వేరు చేసి ప్రేమ యొక్క నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవ డానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మనం దాని యొక్క విస్తారమైన శక్తినీ, దానియొక్క మహత్ప్రభావాన్ని అను భవించగలుగుతాము” అంటారు స్వామి వివేకానంద.
ప్రేమయే జీవనసారం అని చెప్పే శ్రీ సత్యసాయిబాబా ”హృదయములో నాటిన ప్రేమ బీజం మొలకెత్తి పెరుగుచూ బంధుమిత్రుల వరకూ, గ్రామము వరకూ క్రమక్రమముగా వ్యాపించి ఆపైన తరతమ, పేద ధనిక భేద భావం లేకుండా మానవాళినంతనూ తన నీడ క్రిందకు తీసుకురాగలదు” అం టారు. ప్రేమ ఉన్నచోట భయం ఉండదు. పరిశుద్ధమైన ప్రేమ అన్నిరకాల భయాలను పోగొడుతుంది. నిస్వార్థమైన ప్రేమ ఒక దైవశక్తి. ప్రేమ దైవాన్ని తన దగ్గరకు రప్పించుకోగలదు. నమ్మకం, ఆపేక్ష, ప్రేమ అనే మూడు గుణాలలో ప్రేమ అన్నింటి కంటే గొప్పది, మహిమగలది అంటారు.
పండరీ యాత్ర చూడాలనుకున్న సక్కుబాయిని భర్త, అత్త మామలు బంధించగా ఆమె ప్రేమైక తపనకు పొంగిపోయిన పండరీనాధుడు సక్కుబాయి రూపంలో బందీగా మారు తాడు. శబరి పరమ ప్రేమకు ముగ్ధుడైన శ్రీరామచంద్రుడు ఆమె ఎంగిలి చేసి ఇచ్చిన పళ్లనే ప్రీతిగా ఆరగిస్తాడు.
”రామయ్య, నా జీవనోపాధి ఈ పడవ మాత్రమే. రాయి ని స్త్రీగా మార్చిన నీ పాదం నా పడవను ఎలా మారుస్తుందో… అయ్యా, అందుకే ముందుగా నీ పాదాలను తాకి, కడిగి పరీక్షిం చాకే నా పడవనెక్కు” అని గుహుడు చమత్కారంతో తన ప్రేమైక కోరికను తీర్చుకోగా, ఆ గుహుణ్ణి ఆలింగనం చేసుకుం టాడు లోకాభిరాముడు.
పద కవితా పితామహుడైన అన్నమయ్య చూపిన ప్రేమకు పులకరించిన తిరుమలేశుడు బోయవానిగా మారి అన్నమ య్య ఎక్కిన పల్లకిని మోసాడు.
బమ్మెర పోతన నిష్కల్మషమైన నిస్వార్థమైన ప్రేమకు పొంగిపోయిన పరమాత్ముడు పోతనగా వచ్చి భాగవతంలోని ఓ పద్యం పూర్తి చేసి వెళ్తాడు.
రాయబారం ముగించుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధప డిన కృష్ణపరమాతుణ్ని విందారగించమని పిలిచిన దుర్యో ధనుని భవనానికి వెళ్లకుండా విదురుని హృదయపూర్వక ఆహ్వానాన్ని అందుకొని విదురునింట విందారగిస్తాడు.
కృష్ణుడు సత్యావిధేయుడని పేరున్నా సత్యభామ సంపద నంతటిని త్రాసులో ఉంచిన తూగని కమలనాభుడు రుక్మిణి నిష్కల్మష ప్రేమతో త్రాసులో ఉంచిన తులసీదళానికి తూగి ఆశ్చర్యపరుస్తాడు.
ప్రేమ ఓ అద్భుత భావన… హృదయాంతరంలో అనిర్వచ నీయమైన స్పందన… ఆధ్యాత్మిక భావన కూడా! స్వ, పర భావాలకు దూరంగా ఉంటుంది. ప్రేమ గుణం మనిషి ఔన్న త్యానికి ప్రతీక. ఎదుట ఎంతటి ప్రతికూల భావాలున్న వ్యక్తికైనా తన చేతినందించ సిద్ధపడుతుంది. అందుకే అంటారు ”సమస్త సృష్టిని సమదృష్టితో చూడగలిగే తత్వమే ప్రేమత్వం” అని.
ప్రేమ ఒక అమృత ధార. ద్వేషం విషపు బిందువు. ద్వేషం మనిషిని బలహీనపరిచి మానసికంగా దెబ్బతీస్తుంది. అసూ యాద్వేషాలను ఇతరుల మీదికి పంపితే అవి చక్రవడ్డితో వచ్చి మనముందే పడుతాయి. అందుకే మనిషి ద్వేషాన్ని దూరం చేసుకోవాలి. ఆనాడే నిరాణాత్మకంగా వ్యవహరిస్తూ ఆయన సంతోషంగా జీవించగలుగుతాడని మన పూర్వీకులు ఏనాడో చెప్పడమేగాక ఆచరించి చూపారు. మన పురాణతిహాసాల్లో కూడా వీటి గురించి ఎన్నో కథలు చెబుతూ మానవ జీవన విధానాలకు బాటలు పరిచాయి. మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ప్రేమ సిద్ధాంతాన్ని అమలుపరిచి కోరుకున్నవిధంగా జీవి తాన్ని మార్చుకునే అవకాశం ఉన్నట్టు చెబుతుంది.
ఇవేవి పట్టించుకోని మనుషుల్లో ప్రేమానురాగాల స్థానం లో స్వార్థం, ద్వేషం, కౄరత్వం చోటు చేసుకున్నాయి. అంతే గాక మనుషుల్లో దైవభక్తి నానాటికి సన్నగిల్లిపోతుంది. దైవభక్తి ఉన్నప్పుడు ప్రేమతత్వం వర్ధిల్లుతుంది. అప్పుడు ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. అందుకే ఈ భూమ్మీద మనిషి సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించడానికి మనసు లో ప్రేమకు చోటివ్వాలి. విజ్ఞానాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తున్నా డో అంతే స్థాయిలో ప్రేమను పెంచుతూ పంచాలి. అప్పుడే మనిషి తన ఔన్నత్యాన్ని నిలుపుకోగలడు.

– పరికిపండ్ల సారంగపాణి
9849630290

Advertisement

తాజా వార్తలు

Advertisement