Friday, March 29, 2024

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే.. డెల్టా ముప్పు తప్పినట్లే..

బ్రిట‌న్‌లో డెల్టా వేరియంట్ ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకుంటే.. ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు అని తాజా అధ్య‌య‌నం తేల్చింది. రెండు డోసుల టీకా డెల్టాపై అత్యంత ప్ర‌భావంతంగా ప‌నిచేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ ప‌బ్లిక్ హెల్త్ శాఖ చెప్పింది. రెండు డోసులు తీసుకోవ‌డం వ‌ల్ల హాస్పిట‌ల్ అడ్మిష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు అని పేర్కొన్న‌ది. ఫైజ‌ర్ టీకా రెండు డోసులు తీసుకుంటే.. 96 శాతం కేసుల్లో చికిత్స అవ‌స‌రం రాలేద‌న్నారు. ఇక ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న‌వారిలో 92 శాతం మంది సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ఇంగ్లండ్ ప‌బ్లిక్ హెల్త్ స్ట‌డీ వెల్ల‌డించింది. డెల్టా స్ట్రెయిన్ తొలుత ఇండియాలో ఎక్కువ సంఖ్య‌లో విధ్వంసం సృష్టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బ్రిట‌న్ కూడా ఈ డెల్టా వేరియంట్‌తో ఇబ్బందిప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ క‌రోనా ఆంక్ష‌ల‌ను జూన్ 21వ తేదీ వ‌ర‌కు పెంచేశారు. ఏప్రిల్ 12 నుంచి జూన్ 4వ తేదీ వ‌ర‌కు 14 వేల కొత్త కేసుల‌ను ఇంగ్లండ్ ప‌రిశీలించింది. యూకే గ‌వ‌ర్న‌మెంట్ లెక్క‌ల ప్ర‌కారం 57 శాతం మంది ప్ర‌జ‌లు రెండు డోసుల టీకాల‌ను తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement