Friday, May 10, 2024

నేటి రాశి ప్రభ (23-4-2021)

మేషం:
రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం:
కుటుంబసభ్యులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాల సందర్శనం.

కర్కాటకం:
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు.నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం:
ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్ర లాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని ప్రగతి.

కన్య:
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. దైవచింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

తుల:
పనులు మందగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం:
శ్రమ ఫలిస్తుంది. కొన్ని పనులు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగులకు హోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ధనుస్సు:
ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

మకరం:
వ్యవహారాలలో కొన్ని ఆటంకాలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలో నిరుత్సాహపరుస్తాయి. దైవారాధనలో పాల్గొంటారు. ఆరోగ్యభంగం.

కుంభం:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

మీనం:
నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. సన్నిహితులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు కొత్త ఆశలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement