Sunday, May 19, 2024

నేటి రాశి ప్రభ (23-03-2021)

మేషం:
శ్రమకు ఫలితం కనిపిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

వృషభం:
వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం:
రుణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

కర్కాటకం:
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం:
పనుల్లో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య:
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో పూర్వవైభవం.

తుల:
పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం:
నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు, సోదరుల నుంచి కీలక సమాచారం. భూవివాదాల పరిష్కారం.
పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

ధనుస్సు:
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు.

మకరం:
మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం:
మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు మీదపడతాయి.

మీనం:
పరిచయాలు పెరుగుతాయి.స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనయోగం. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement