Thursday, May 16, 2024

నేటి రాశి ప్రభ (17-11-21)

మేషం: ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. ఇంటా బయటా అనుకూలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

వృషభం: రుణ ఒత్తిడులు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో చికాకులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. వృథా ఖర్చులు. ఆలయాలు సందర్శిస్తారు.

సింహం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

- Advertisement -

కన్య: వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. సన్నిహితులు సహాయపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు.

తుల: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయ ప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. బంధువులతో మాట పట్టింపులు.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. దూర ప్రయాణాలు. ఉద్యోగులకు గందరగోళం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఆరోగ్య భంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తు లాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహన యోగాలు. వ్యాపార,
ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుంభం: కుటు-ంబంలో చికాకులు. దూర ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా. శ్రమాధికం. ఆరోగ్య భంగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి ఒప్పందాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. ఆరోగ్య భంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement