Thursday, May 2, 2024

నేటి నుంచి అప్పన్న దర్శన వేళలు పెంపు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: కోవిడ్‌ తగ్గు తున్న నేపధ్యంలో సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృసింహస్వామి దర్శన వేళల్లో ఆలయ వర్గాలు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 2019 నుంచి దశల వారీగా స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. గత కొద్ది నెలలుగా సాయంత్రం 7 వరకే భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తదుపరి ఆరాధన, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం నుంచి ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి 11.30 వరకు, 12.30 నుంచి 2.30 వరకు, 3.30 నుంచి రాత్రి 7 వరకు తిరిగి 8.30 నుంచి రాత్రి 9 వరకు సింహాద్రినాధుడి దర్శనభాగ్యం భక్తులకు పూర్తి స్థాయిలో లభించనుంది. ఇతర సమయాల్లో స్వామికి ఆరాధన, రాజభోగం, బాలభోగం, పవలింపుసేవలు నిర్వహిస్తారు. కావున భక్తులు ఆయా సమ యాల్లో స్వామిని దర్శించుకొని తరించాల్సిందిగా ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ విజ్ఞప్తి చేశారు. ఇక సింహాద్రినాధుడి నిత్యకళ్యాణం, గరుడసేవ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. గురు, ఆదివారాల్లో రూ.2500 టిక్కెట్‌పై స్వర్ణపుష్పార్చన, ఏకాదశి పర్వదినం నాడు రూ.2500 టిక్కెట్‌పై స్వర్ణ తులసీదళార్చనలో భక్తులు పాల్గొనవచ్చు. రూ.100 టిక్కెట్‌పై లక్ష్మీనారాయణస్వామి వ్రతం, రూ.50 టిక్కెట్‌పై అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు నిర్వహించుకోవచ్చునని ఆలయ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement